విశాఖ

రూ. 19.80 లక్షల చందన్న బీమా చెక్కుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జూన్ 20: సబ్బవరం, పెందుర్తి,పరవాడ మండలాలకు చెందిన 19 మంది మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా సహాయంలో మంజూరయిన 19లక్షల 80వేల రూపాయలను పెందుర్తి ఎమ్మెల్యే బండారుసత్యనారాయణమూర్తిపంపిణీ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బడికొస్తా సైకిళ్ళ పంపిణీ సభలోనే ఆయనకు స్థానిక మండల వెలుగు ఎపిఎంవో బివి రమణ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అప్పగించారు. దీంతో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ చంద్రన్నబీమా పథకంతో నిరుపేదల కుటుంబాలకు చెందినవారు సహజంగానోలేక ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు వీధిన పడకుండా ఆర్థిక స్తోమత కల్పించేందుకు సిఎం చంద్రబాబు ఈపథకం రూపొందించారన్నారు. సబ్బవరం మండలంలో మొత్తం 8 మంది మృతి చెందగా అందులో రెండు కుటుంబాలకు చెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున, ఆర కుటుంబాలకు 30వేల రూపాయల చొప్పున సహాయం అందజేశారు. అలాగే పరవాడ మండలంలో 8 కుటుంబాలకు 2.40లక్షలు, పెందుర్తిలో 3 కుటుంబాలకు 5.60లక్షల చొప్పున బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఇసిఎస్ చైర్మన్ కొటాన అప్పారావు, ఆయామండలాల ఎంపిడివోలు శ్రీనివాసరావు,కె.సూర్యనారాయణ,ఎపిఎంవోబివి రమణ, టిడిపి నేతలు ఎం.మహలక్ష్మినాయుడు,కోరాడ శ్రీనివాసరావు,ఎం.అక్కుబాబు,ఆకుల గణేష్, గండి దేముడు,ఎస్.ముత్యాలనాయుడు,గేదేల సత్యనారాయణ, గవర అప్పారావు,సత్యనారాయణ,దాసరి రమణలు పాల్గొన్నారు.

దొండపూడిలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరింపు
రావికమతం, జూన్ 20: యువకుడు ఆత్మహత్య నేపధ్యంలో మండలంలో దొండపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్దితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అనకాపల్లి డి ఎస్పీ వై. ఎస్.రమణ ఆధ్వర్యంలో మంగళవారం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈగ్రామంలో సోమవారం ఎన్.నవీన్‌కుమార్(19) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమ కుమారుడిని హత్య చేసారని, దళితులైన తల్లిదండ్రులు అప్పారావు,రమణమ్మలు దళిత నాయకుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకువెళ్ళారు. ఈమేరకు దళిత సంఘ నాయకులు జి.కళ్యాణరావు, ఇ.పెంటారావు తదితరులు బాధిత కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి సంఘటనకు సంబంధించి పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక దశలో గ్రామంలో నిరసన కార్యక్రమానికి దళిత నాయకులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న డి ఎస్పీ రమణ దళిత నాయకులను కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి చర్చలు జరిపారు. ఈసందర్భంగా నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి కేసు దర్యాప్తు చేస్తున్నందున వాస్తవాలు బయటకు వస్తాయని, దోషులకు శిక్ష పడుతుందని స్పష్టం చేసారు. ఈమేరకు నిరసన కార్యక్రమాన్ని ఉప సంహరించుకున్నారు. ఈసందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఈకేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగని యెడల ఆందోళన తప్పదన్నారు.