విశాఖ

భూ దందాపై మహాధర్నాను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూన్ 20: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన రెడ్డికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉండాల్సినవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకన్నపాలెం షిర్డీసాయి మందిర సమీపంలోని శివాలయం వద్ద వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం, స్థానిక కోనాం గెస్ట్‌హౌస్ వద్ద ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన విశాఖలో జరిగిన భూ దందాపై నిర్వహించతలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులను, కార్యకర్తలు సమాయాత్తం కావాలని ఆయన సూచించారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నారని, ఆయన పోరాటానికి మనందరం ఆయనకు అండగా నిలవాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాసేవకే అంకితమైన వైఎస్‌ఆర్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచి ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎళ్లవేళలా అవసరమైన కార్యక్రమాలు చేపడుతూనే ఉందన్నారు. ఈ నేపధ్యంలోనే విశాఖలో సుమారు లక్షకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగుచూడటంతో ఈ భూ దందాపై వైఎస్సాఆర్ పార్టీ విశాఖలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాన్ని చేపడుతున్న సమాచారాన్ని తెలుసుకున్న అధికార పార్టీలో గుబులు మొదలైందన్నారు. ఈ భూ దందా విషయాన్ని జిల్లామంత్రి అయ్యన్నపాత్రుడే స్వయంగా ప్రభుత్వానికి వివరించిన విషయాన్ని గుర్తుచేసారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి 20మంది వంతున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆటోల్లో, బస్సుల్లో తరలివచ్చి ఈ ఆందోళనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వారివారి అభిప్రాయాలను, పార్టీ పటిష్ఠతకు చేపట్టాల్సిన చర్యలను, అనుసరించాల్సిన విధివిధానాలను వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొడ్డేడ సూర్యనారాయణ, ఏడువాక సత్యారావు, అప్పికొండ సోమేశ్వరరావు, అప్పికొండ లింగబాబు, నాగులాపల్లి రాంబాబు, వేచలపుప్రకాష్, శానాపతి సత్యారావు, సూరిశెట్టి గోవింద, పతివాడ అప్పారావు, ఎంవి శ్రీకాంత్, ఓరుగంటి నెహ్రూ, బొడ్డు శ్రీరామ్మూర్తి, కోన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

భూ వివాదంలో గిరిజనుడు దారుణ హత్య
అరకులోయ, జూన్ 20: భూ వివాద సంఘటనలో గిరిజనుడు మంగళవారం హత్యకు గురయ్యాడు. మండలంలోని గనె్నల పంచాయతీ అమలగుడ గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు కలిసి అదే గ్రామానికి చెందిన మరో గిరిజనుడిని దారుణంగా హత్య చేసారు. సాగు భూములకు సంబంధించి ఈ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఈ తగాదా చిలికిచిలికి గాలివానగా మారి ప్రాణం మీదకు తెచ్చింది. అమలగుడ గ్రామానికి చెందిన కిల్లో కొమ్ముదాసు (42)కు చెందిన భూమిలో అదే గ్రామానికి చెందిన కిల్లో స్వామిరాజు, స్వాభి నారాయణ, స్వాభి భీందర్ అనువారు మొక్కలు నాటారు. దీంతో తన భూమిలో మొక్కలు ఎందుకు నాటారని, పోలీసులకు పిర్యాదు చేస్తానని కొమ్ముదాసు వారిని బెదిరించారు. తమపై పోలీసు పిర్యాదు చేస్తానని బెదిరిస్తావా అంటూ ఆగ్రహించిన ఈ ముగ్గురు పథకం ప్రకారం గొడ్డలితో దాడి చేసి హత్య చేసారు. ఈ సంఘటనపై మృతుడి భార్య కిల్లో రుక్మిణి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో అరకులోయ సిఐ ఇ.వెంకునాయుడు, ఇన్‌చార్జి ఎస్.ఐ. అమ్మనరావు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు నిర్వహించారు. హత్యకు పాల్పడిన స్వామిరాజు, స్వాభి నారాయణ, స్వాభి భీందర్‌లను అరెస్ట్ చేసారు. హతుడి మృతదేహానికి శవ పరీక్ష నిమిత్తం అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు.