విశాఖ

న్యాయ పోరాటానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ విశాఖలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలియచేశారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ సిట్ వలన బాధితులకు న్యాయం జరగదు. సిబిఐ విచారణ కాలయాపన జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు, పరిటాల రవి హత్య కేసు, వోక్స్ వ్యాగన్ కేసులను రెండేళ్లలోనే సిబిఐ విచారించి నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని గుడివాడ గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్ భూ కుంభకోణంపై అక్కడ టిడిపి నేతలు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ కుంభకోణంలో జాప్యం జరగదా? అని అమర్ ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి గంటా చేసిన విజ్ఞప్తిని సిఎం ఎందుకు ఆమోదించడం లేదని ఆయన ప్రశ్నించారు.
విశాఖ భూ కుంభకోణంలో ప్రభుత్వం సిబిఐ విచారణకు అంగీకరించకపోతే, రాష్టప్రతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని ఆశ్రయిస్తామని అమర్ చెప్పారు. అప్పటికీ న్యాయం జరగకపోతే, న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా గురువారం జగన్ ఉదయం విశాఖకు చేరుకుని, నేరుగా దసపల్లా భూములను పరిశీలిస్తారని అమర్ వివరించారు. అక్కడి నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగే మహా ధర్నాకు హాజరవుతారని ఆయన వివరించారు.

మహాసంకల్పం వాయిదా
* 24న నిర్వహించాలని నిర్ణయం
* విశాఖపై జగన్ కక్షగట్టారు
* ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖపట్నం, జూన్ 20: విశాఖ భూ కుంభకోణంపై వైకాపా ఈ నెల 22న తలపెట్టిన మహాధర్నాకు కౌంటర్‌గా టిడిపి నిర్వహించాలనుకున్న మహాసంకల్ప సభను వాయిదా వేసుకుంది. భూ కుంభకోణంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న వైకాపా తీరును ఎండగట్టాలని అదేరోజున మహాసంకల్పం పేరిట భారీ సభ నిర్వహించాలని తొలుత భావించగా, అదే రోజు వైకాప దీక్ష ఉండటంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందన్న కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే విషయాన్ని విశాఖ అర్బన్ టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై విపక్ష వైకాపా లేనిపోని రాద్ధాంతం చేస్తోందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించిందన్నారు. భూ కుంభకోణంలో అధికార టిడిపి ఎటువంటి సంబంధం లేనప్పటికీ విపక్షం విమర్శలు చేయడం సరికాదన్నారు. కుంభకోణంపై సిబిఐ లేదా సిబిసిఐడి దర్యాప్తు జరపాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి లేఖరాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆర్థిక నేరాల్లో దోషిగా జైలు కెళ్లిన జగన్ భూ కుంభకోణంపై మహాధర్నాకు సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. విశాఖపై వైకాపా నేత కక్షగట్టారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి విజయమ్మ పోటీ చేసి ఓటమి పాలైనప్పటి నుంచి విశాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ యత్నిస్తున్నారన్నారు. గతంలో ప్రత్యేక హోదా పేరిట రిపబ్లిక్ దినోత్సవం రోజున ధర్నాకు సిద్ధపడటం ద్వారా జగన్ విశాఖ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తాజాగా భూ కుంభకోణం అంశాన్ని సాకుగా చూపి అంతర్జాతీయంగా విశాఖ నగర ఖ్యాతిని దిగజార్చేందుకు యత్నిస్తున్నారన్నారు.
5వేల మందితో మహాసంకల్పం
విపక్ష నేత జగన్ కుట్రలను తిప్పికొట్టేందుకు టిడిపి ఆధ్వర్యంలో అనుకున్నట్టుగానే మహాసంకల్పం సభ జరుగుతుందని, అయితే ఈ నెల 24న నిర్వహిస్తున్నామన్నారు. 5వేల మంది కార్యకర్తలతో భారీ కార్యక్రమం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టనున్నట్టు వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైన విపక్ష వైకాపాను భూస్థాపితం చేసే విధంగా మహాసంకల్పం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టిడిపి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడే పట్ట్భా తదితరులు పాల్గొన్నారు.