విశాఖ

ముప్పేట దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అధికార పార్టీపై విపక్షాలన్నీ కలిసి ముప్పేట దాడి చేయడానికి సిద్ధపడుతున్నాయి. విశాఖ భూముల కుంభకోణం నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ వెతుకుతోంది. మంత్రులు అయ్యన్న, గంటా మధ్య ఉన్న విభేదాలను మరోసారి తెర మీదకు తెచ్చి, భూ కుంభకోణ కథనాలకు పత్రికలను కొన్నాళ్లు దూరంగా ఉంచాలని భావించారు. అయితే, వీరిద్దరివీ గిల్లికజ్జాలేనని పత్రికలు ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పట్టాల పండుగ పేరుతో మరోసారి విశాఖలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఈ కుంభకోణం నుంచి మళ్లించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. భూముల కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ వ్యూహాలను విపక్షాలు పసిగడుతున్నాయి. భూముల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, దోషులను శిక్షించాలన్న డిమాండ్‌తో వైకాపా, సిపిఐ, సిపిఎం, జనసేన, లోక్‌సత్తా, బిఎస్‌పి తదితర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. భూ కుంభకోణంలో అధికార పార్టీ మెడలు వంచేందుకు వీరు పోరాడుతున్నారు. ప్రజా క్షేత్రంలో తాము కూడా ఉన్నామన్న భావన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా భూముల కుంభకోణంపై ప్రభుత్వాన్ని దోషిగా చూపుతూ గొంతు విప్పింది. దీంతో అధికార పార్టీ వారంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు!
ఈ ప్రశ్నలకు బదులేదీ?
* విశాఖలో భూ కుంభకోణాన్ని కలెక్టర్ ముందుగా బహిర్గతం చేయడం తప్పిదమా?
* విశాఖలో భూములు కబ్జాకు గురవుతున్నాయని మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటనలో నిజం ఉందా? లేదా?
* ముదపాక భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెపుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందా?
* ముదపాక భూముల కుంభకోణాన్ని ప్రభుత్వం ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
* విశాఖలో భూ కుంభకోణంపై సిఐడి లేదా సిబిఐ విచారణ జరిపించమని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరడం సమంజసమా? కాదా?
* టాంపరింగ్‌కు గురైన రికార్డులను మళ్లీ యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
* విశాఖ భూ కుంభకోణంలో నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అందులో భాగంగానే సిట్‌ను నియమించి చేతులు దులుపుకొందా?
* విశాఖలో భూములు కోల్పోయిన బాధితులకు మంత్రులు ఎందుకు అండగా నిలవలేకపోతున్నారు?
ఇటువంటి అనేక ప్రశ్నలను విపక్షాలు ప్రభుత్వంపై సంధిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పడానికి మంత్రులు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. వాస్తవానికి భూముల కుంభకోణం విషయంలో విపక్షాలకు ఆయుధాన్ని అందించింది జిల్లా మంత్రులే. భూ కబ్జాలు నిజమేనని మంత్రి అయ్యన్న అంగీకరించడం, సిబిఐ, లేదా సిఐడి విచారణ జరపాలని గంటా కోరడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రులు వేసిన తప్పటడుగుతో ప్రభుత్వం తలెత్తుకోలేని స్థితికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు జరపుతామని సాక్షాత్తూ చంద్రబాబు చెప్పినా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. భూ కుంభకోణంపై ఈనెల 15న బహిరంగ విచారణ జరపుతాయమని చెప్పి, ప్రభుత్వం వెనక్కు తగ్గినప్పుడే, కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన వారి హస్తం ఉందని ప్రజలకు నమ్మకం కలిగించినట్టయింది. ఒక పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం మరిన్ని తప్పులు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. 22న వైకాపా బహిరంగ సభ నిర్వహించిన తరువాత, దానికి బదులివ్వడానికి టిడిపి 24న సంకల్ప సభ ఏర్పాటు చేసింది. అధికార పార్టీ చేస్తున్న మరో తప్పిదం ఇది. వైకాపాను నిరోధించేందుకు అధికార పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నం బెడిసికొడితే, పరిస్థితి ఏంటి? చంద్రబాబు సలహా మేరకు ఈ సభ నిర్వహిస్తున్నారా? లేక స్థానిక నాయకుల సొంత ఆలోచనా? ఏదియేమైనప్పటికీ 24 సభ విపక్షాలను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది అనడంలో సందేహం లేదు!