విశాఖపట్నం

విశాఖ నీటి అవసరాలు తీర్చేది పురుషోత్తపట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 15: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తయితే విశాఖ సాగు,తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలు తీరినట్టేనని రహదార్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి కష్టాలు తీరినట్టేనని పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పురుషోత్తపట్నం తొలి దశను పూర్తి చేసినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గీతంలో స్వాతంత్య్ర దినోత్సవం
* పతాకాన్ని ఆవిష్కరించిన వైస్‌ఛాన్స్‌లర్

విశాఖపట్నం, ఆగస్టు 15: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యార్థులు కృషి చేయాలని గీతం విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్శిటీలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ నూతన అనే్వషణలు, పరిశోధనలకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశం గర్వించతగ్గ మానవ వనరులను అందించాలన్న లక్ష్యంతో గీతం యూనివర్శిటీ ముందుకు సాగుతోందన్నారు. దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో ప్రోవైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం సత్యనారాయణ, కె లక్ష్మీప్రసాద్, ఎస్ అరుణలక్ష్మి, ఎస్ గణపతి, మోహన్, షీలా, డాక్టర్ కనకలక్ష్మి, డాక్టర్ ఎస్‌పి రావు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు జాతీయ గీతాలను ఆలపించి అలరించారు.

అద్వితీయ ప్రగతి సాధించిన ఎయు
స్వాతంత్య్ర స్పూర్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని, బోదన, పరిశోధన రంగాల్లో అద్వితీయ ప్రగతిని సాధించిందని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి నాగేశ్వర రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రగతికి ఎంతోమంది శాస్తవ్రేత్తలను, సుశిక్షితులైన ఉద్యోగులను అందించిన ఘనత ఎయుదేనన్నారు. ఎయు ఖ్యాతిని మరింత విస్తృత పరిచేందుకు బోధన, పరిశోధన రంగాల్లో సమృద్ధిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. రక్షణ రంగ ఉద్యోగుల కోసంయు ప్రత్యేక కోర్సులను అమలు చేస్తోందని గుర్తు చేశారు. వివిధ సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన కుదుర్చుకుని ప్రగతిని సాధిస్తోందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్కరం ముందుకు సాగుతూ యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఎస్‌ఎస్ శర్మ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి ఉమామహేశ్వర రావు, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ రామ్మోహన రావు, పిఎస్ అవధాని, డిఇ బాబు, డిఎస్ ప్రకాశరావు, గౌరీ శంకర్ పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లాలో
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ బంగ్లాలో ప్రవీణ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుంచి భారత ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వారి త్యాగ ఫలితమేనన్నారు. అటువంటి వ్యక్తుల త్యాగాలను స్పూర్తిగా తీసుకుని దేశా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. జిల్లాను అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రజా ప్రతినిధుల సహకారంతో సమష్ఠి కృషి చేస్తున్న యంత్రాంగం సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి సృజన, సహాయ కలెక్టర్ మిషా సింగ్, డిఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యప్రకాష్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే న్యూ ఆర్‌పిఎఫ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని అదనపు డిఆర్‌ఎం అజయ్ అరోరా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది వాల్తేరు డివిజన్ సరుకు రవాణాలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. 52.7 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.5,864.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ముడి ఇనుము, కోల్, ఎరువులు, ఇనుప ఖనిజం రవాణా ద్వారా ఈ ప్రగతి సాధించినట్టు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్ నెలల్లో 17.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 2,054.16 కోట్ల ఆదాయాలన్ని ఆర్జించిందన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం రూ.184.77 కోట్లు అదనమని పేర్కొన్నారు. రైల్వే సాధిస్తున్న ప్రగతిలో ప్రతి ఉద్యోగి, అధికారి పాత్ర ఉందన్నారు. ఈ సందర్భంగా తూర్పుకోస్తా జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులు, అధికారులకు సర్ట్ఫికేట్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

సెంట్రల్ జైలులో
జిల్లా కేంద్ర కారాగారంలో ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డిఐజి శ్రీనివాస్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మానసిక పరివర్తనతో మంచి నడచుకోవాలన్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చే విధంగా జైళ్ల శాఖ సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు జైలు అధికారులు, ఖైదీలు పాల్గొన్నారు.

ఇందిరా ప్రియదర్శిని జంతుప్రదర్శన శాలలో
విశాఖ ఇందిరా ప్రియదర్శిని జంతు ప్రదర్శన శాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్యూరేటర్ బి విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జూ అధికారులు, రేంజర్లు తదితరులు పాల్గొన్నారు.