విశాఖపట్నం

కొలిక్కి వస్తున్న ఎన్‌ఓసిల దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ రూరల్ ప్రాంతంలో ప్రభుత్వ, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు ఇచ్చిన నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్లు (ఎన్‌ఓసి)పై జరుగుతున్న దర్యాప్తు కొలిక్కి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 69 ఎన్‌ఓసిలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత కలెక్టర్లు వీటిని జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఎన్‌ఓసిలు జారీ అయ్యాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు, కలెక్టర్లపై వత్తిడి తెచ్చి ఎన్‌ఓసిలు ఇప్పించారు. విశాఖలో భూ కుంభకోణం వెలుగు చూసిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఒక్కో ఎన్‌ఓసి బాగోతం బయటకు వచ్చింది. భూ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌కు కేవలం ఎన్‌ఓసిలపై 69 ఫిర్యాదులు వచ్చాయి. ఏసిపి స్థాయి అధికారి వీటిపై దర్యాప్తు జరుపుతున్నారు. వీటిలో 20కి పైగా తప్పుడు ఎన్‌ఓసిలని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 69 ఎన్‌ఓసిలపై దర్యాప్తు మరొక 15 రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. ఎన్‌ఓసిల్లో అవతవకలు జరిగాయని తేలితే, అందుకు గత కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కొంతమంది ఐఎఎస్ అధికారులతో చట్ట విరుద్ధ పనులు చేయడంతో వారు కటకటాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గణేష్‌కు అస్వస్థత అట!
ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న గణేశ్వరరావుకు అస్వస్థత అట. రెండు రోజులుగా పోలీస్ ఇంటరాగేషన్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిలో కొన్నింటికి మాత్రమే గణేశ్వరరావు బదులిచ్చినట్టు తెలిసింది. మూడో రోజైన మంగళవారం తనకు ఆరోగ్యం బాగాలేదని మొరాయించాడట! గణేశ్వరరావుకు ఈనెల 24 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతి ఉంది. ఈలోగా గణేశ్వరరావు కీలక సమాచారం వెల్లడిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాలి.