విశాఖ

ఎన్‌వోసిలపై సిట్ బృందం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, ఆగస్టు 22: మాజీ సైనికోద్యుగులకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి సంబంధించి పూర్వపు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఎన్‌వోసిలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) మంగళవారం పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామాన్ని సందర్శించింది. పరవాడ మండలానికి సంబంధించి దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 360,361,363,364,365,367,315లో గల ప్రభుత్వ భూమిని అధికారులు మాజీ సైనికోద్యోగులకు కేటాయించడం జరిగింది. ఈ స్థలాన్ని విక్రయించుకునేందుకు 2007 అప్పటి ప్రభుత్వం ఎన్‌వోసిలు జారీ చేసింది. అయితే విశాఖపట్నం భూ కుంభకోణాలు బట్టబయలైన సందర్భంలో జిల్లా వ్యాప్తంగా అప్పటి అధికారులు జారీ చేసిన ఎన్‌వోసీలు బయటకు వచ్చాయి. ఎన్‌వోసీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జారీ అయ్యాయా, నిజమైన మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన స్థలాలేనా, ఎన్‌వోసీల జారీ చట్టానికి లోబడి జరిగాయా అన్న విషయాలపై ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్న విషయం విధితమే. దీంట్లో భాగంగా దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో గల మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన స్థలాలకు సుమారు 8 ఎన్‌వోసీలు 2007లో జారీ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌వోసీల వెనక ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. ఈ భూములు మాజీ మంత్రికి సంబంధించిన బంధువులే కొనుగోలు చేశారన్న ఆరోపణలు లేక పోలేదు. సిట్ బృందం మంగళవారం దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. సదరు స్థలాల్లో ఏ పంట ఉందన్న విషయాన్ని ప్రధానంగా పరిశీలించారు. మాజీ సైనికోద్యుగులకు కేటాయించిన స్థలాన్ని పరవాడ రెవెన్యూ అధికారులు సిట్ బృందానికి చూపించింది. రెవెన్యూ అధికారులు చూపించిన స్థలంలో కొన్ని చోట్ల జీడి, మామిడి, నీలగిరి చెట్లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎటువంటి మొక్కలు లేవు. వీటిని పరిశీలించిన సిట్ బృందం రెవెన్యూ అధికారులు మరికొన్ని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎసిపి రంగరాజు మాట్లాడుతూ సిట్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన స్థలాల్లో ఏ పంట వేశారన్న విషయం తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. దీనిపై నివేధిక తయారు చేసి సిట్ ఉన్నతాధికారులు నివేధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిట్ బృందంలో సిఐ తిరుమలరావు, రెవెన్యూ అధికారులతో పాటు పరవాడ తహశీల్దార్ మల్లేశ్వరరావు ఉన్నారు.