విశాఖ

రైవాడ రైతుల్ని మోసం చేస్తే రైతుల పక్షాన నేనే పోరాడుతా ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, సెప్టెంబర్ 18: ఏ రైతు అధైర్య పడాల్సిన అవసరం లేదని, పోలవరం తోనే రైవాడ సమస్య పరిష్కారం కావడం ఖాయమని, ఒకవేళ ప్రభుత్వం రైతుల్ని మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తే రైతుల పక్షాన తానే ముందుండి పోరాడుతానని లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. జనం కోసం జేపి సురాజ్య యాత్ర నినాదంతో గత నాలుగు రోజుల నుంచి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం రైవాడ జలాశయాన్ని, మారికగెడ్డ నిర్మాణం చేసే స్ధలాన్ని సందర్శించారు. రైవాడ జలాశయం, మారికగెడ్డ వివరాలను అడిగి తెలుకున్నారు. వారు చెప్పిన వివరాలు సరిగ్గా లేకపోవడంతో అతని వెంట తెచ్చుకున్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైవాడ జలాశయం నుంచి సాగునీరు ప్రస్తుతం అందిస్తున్న 15,344 ఎకరాలతో పాటు అదనపు ఆయకట్టు ఆరువేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందించడానికి సరిపడే విధంగా జలాశయాన్ని నిర్మించారన్నారు. అనంతరం దేవరాపల్లి నాలుగు రోడ్లు కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వరి దేవి ఆలయం ఆవరణలో శ్రీ మల్లిఖార్జున ఆయకట్టుదారుల సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అప్పటి సిఎం జలగం వెంగళరావు భలిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని నీటిపారుదలకు, విద్యుత్‌కి పెద్దపీట వేశారన్నారు. ఆయన కృషి ఫలితమే రైవాడ లాంటి జలాశయం ఫలాలు అందరికీ అందుతున్నాయన్నారు. పోలవరం పూర్తయితే రైవాడ, ఏలేరు, తాటిపూడి రైతాంగానికి విముక్తి కలుగుతుందని, ఈ సమస్య గురించి ఆలోచించకుండా రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతీ రైతు వరి చెరకుతో పాటు ఉద్యానవన పంటలవైపు మొగ్గు చూపి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలన్నారు. ప్రతీ సమస్య పరిష్కారానికి జనం గొంతు కలిపితే సాధ్యమవుతుందన్నారు. ప్రజల బతుకులు మారాలంటే యువత ముందుకు రావాలన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తేనే ప్రజలకు మనుగడ ఉంటుందన్నారు. అధ్యక్షత వహించి చిన రామునాయుడు మాట్లాడుతూ 1986 నుంచి జరుగుతున్న రైవాడ ఉద్యమాన్ని నీరుగార్చుతున్న పాలకులకు కనువిప్పు కలిగేలా డాక్టర్ జయప్రకాష్ నారాయణ సహకారంతో రైవాడ ఉద్యమానికి సార్ధకత చేకూరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, జిల్లా నాయకులు లెక్కల శ్రీనివాసరావు ప్రసంగించగా ఆదిరెడ్డి చిన కన్నబాబు, అవుగడ్డ అప్పలనాయుడు, సిపిఐ నాయకులు వేమల కన్నబాబు, కాసుబాబుతో పాటు విజయనగం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన నాయకులు, బండారు రామ్మోమెహన్‌రావు, ఝాన్ని లక్ష్మి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.