విశాఖ

భూ రికార్డుల్లో తప్పుల సవరణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: నిర్ణీత సమయంలో వెబ్‌ల్యాండ్ రికార్డుల్లోని తప్పులు సరిచేసే విధంగా తగు కార్యాచరణ రూపొందిస్తున్నామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ల్యాండ్ రికార్డుల్లో ఫ్వూరికేషన్ అనే అంశంపై జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ రికార్డుల్లో తప్పులు దొర్లటం వల్ల చాలా సమస్యలు తలెత్తున్నాయన్నారు. వచ్చే మూడు,నాలుగు మాసాల్లో ల్యాండ్ రికార్డుల్లో తప్పులను సరిచేసే విధంగా తగు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ల్యాండ్ రికార్డుల్లో తప్పులను సరిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. గతంలో కూడా ల్యాండ్ రికార్డుల్లో తప్పులను సరిచేసేందుకు మీ కోసం, మీ ఇంటికే మీ భూమి వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 98 శాతం భూములను వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో పొందుపర్చడం జరిగిందన్నారు. అయితే 1బి, అండంగ్‌లో తప్పులు దొర్లడంతో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించేందుకు ల్యాండ్ రికార్డులను ఫ్యూరికేషన్ వేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం చేయాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో ఏ విధంగా ల్యాండ్ రికార్డులు ఫ్యూరికేషన్ చేస్తున్నారో తెలుసుకునేందుకు, నిర్ణీత కాల వ్యవధిలో ల్యాండ్ రికార్డులను ఏ విధంగా ఫ్యూరికేషన్ చేయాలో రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వర్క్‌షాపులో అందరి సలహాలు, సూచనలు తీసుకుని, సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగాలన్నారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ విశాఖ రెవెన్యూ విభాగాన్ని నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణపై ఉన్న అపోహలను తొలగించి, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. 90 శాతం ఫిర్యాదులు భూ సంబంధమైనవేనని ప్రభుత్వ భూములను, హక్కుదారులకు శుద్ధీకరణ ద్వారా న్యాయం చేయవచ్చన్నారు. ఈ వర్కుషాపులో మేదోమథనం జరగాలన్నారు. ఈ వర్కుషాపుల ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకొనడం వలన, కాలం వృధాకాదని, క్షేత్రస్థాయిలో అప్‌డేట్ కావచ్చన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అనిల్‌బాబు నెల్లూరు జిల్లాలో చేపట్టిన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణపై వారు చేపట్టిన కార్యాచరణలో ప్రణాళిక అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ వర్క్‌షాపుకు జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలుకగా, ట్రైనీ కలెక్టర్ మిషాసింగ్, ప్రత్యేక ఉప కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.