విశాఖ

పెరిగిన రైళ్ల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: రైళ్ళ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళు పూర్తయినా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వెళ్ళే ప్రయాణికుల శాతం మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. సాధారణ రోజుల్లో సైతం ఇదే పరిస్థితి. సికింద్రాబాద్‌కు విశాఖ నుంచి విశాఖ మీదుగా వెళ్ళున్న రైళ్ళు గతంలో కంటే మెరుగుపడినా రద్దీని తగ్గించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా నిత్యం రాకపోకలు సాగిస్తుండటం, వ్యాపార కార్యకలాపాలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తదితర అనేక రంగాల ప్రతినిధులు, సాధారణ ప్రయాణికులతో రైళ్ళు విపరీతమైన రద్దీతో నడుస్తున్నాయి. వీటికి వలసకూలీలు, సామాన్యులు తోడవుతున్నారు. దీనివల్ల కొన్ని ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళల్లో ఒంటి కాలపైనే ప్రయాణించాల్సి వస్తోంది.
* గోదావరి, విశాఖకు తాకిడి...
ముఖ్యుల రైళ్ళుగా పేరున్న గోదావరి, విశాఖ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఏడాదిలో ప్రతిఒక్కరోజు రద్దీగానే నడుస్తున్నాయి. విశాఖ నుంచి బయలుదేరి వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ డిమాండ్‌ను తగ్గించేందుకు వీలుగా దీని తరువాత రెండు ఎక్స్‌ప్రెస్‌లను పట్టాలెక్కించారు. ఇందులో దురంతో ఒకటి కాగా, గరీభ్థ్ మరొకటిగా చెప్పవచ్చు. వీటితోపాటు భువనేశ్వర్-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. భువనేశ్వర్ నుంచి బయలుదేరి శ్రీకాకులం వచ్చేసరికే దీని రద్దీ పెరిగిపోతుంది. ఇక ఇక్కడ నుంచి సికింద్రాబాద్, విజయవాడలకు విశాఖ ఎక్స్‌ప్రెస్ ద్వారా వెళ్ళాల్సిన వారంతా కనీసం నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే. లేదంటే వెయింటింగ్‌లిస్ట్ చూపుతుంది. వీటితోపాటు ఈస్ట్‌కోస్ట్, కోణార్క్, మరికొన్ని ప్రత్యేకరైళ్ళు విశాఖ మీదుగా సికింద్రాబాద్‌కు 30నుంచి 40 రైళ్ళు ఉంటాయి. అయినా వీటిలో ఏ ఒక్కటి సామాన్యులకు అందుబాటులో ఉండటంలేదు. ఇక కాకినాడ, రాజమండ్రి, రాయగడ, పలాస, దుర్గ్, కోర్బా, సింహాద్రి తదితర పాసింజర్ రైళ్ళల్లో ఎక్కువ శాతం మంది సమీప ప్రాంతాలకు ప్రయాణించేవారు, వలస కూలీలు, సామాన్య మహిళలే ఉంటున్నందురన ఇవి కూడా ఎపుడూ రద్దీగానే నడుస్తున్నాయి. అదీ దసరా, సంక్రాంతి, వేసవి సీజన్లల్లో పాసింజర్ రైళ్ళల్లో సామాన్యులు ఫీట్లు చేయాల్సిందే.
* స్టేషన్‌లో భద్రత పెంపు...
రోజురోజుకీ పెరుగుతున్న ప్రయాణికులతో నిత్యం రద్దీగా కనిపించే విశాఖ రైల్వేస్టేషన్‌కు భద్రతను మరింతగా పెంచుతున్నారు. బీహర్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి విశాఖ మీదుగా వెళ్ళే ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్ రైళ్ళను దృష్టిలోపెట్టుకుని ఈ స్టేషన్‌లో కట్టుదిట్టమైన పోలీసు గస్తీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చోరీలను నియంత్రించడం, తోక్కిసలాటని తగ్గించేందుకు వీలుగా విశాఖ, గోదావరి, తిరుమల, ప్రశాంతి, విశాఖ వంటి ముఖ్యమైన రైళ్ళ జనరల్ కోచ్‌ల వద్ద క్యూలైన్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఎపుడూ రద్దీగా ఉండే ఒకటవ, ఎనిమిదవ నెంబర్ ప్లాట్‌ఫారాలపైన, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబి), ప్రధాన గేట్ల వద్ద 24 గంటలు పోలీసు గస్తీ ఉంటుంది. డాగ్‌స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైళ్ళల్లో తీసుకువెళ్ళే పార్శిళ్ళను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏసి కోచ్‌ల్లోను ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) బృందాలుగా ఏర్పడి స్టేషన్ మార్గంలో ఉండే నాలుగైదు గేట్ల వద్ద, జ్ఞానాపురం స్టేషన్, వాహనాల పార్కింగ్, ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారం, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే క్లోజుడ్ సర్క్యూట్ టివిల ద్వారా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. ఈవిధంగా స్టేషన్ భద్రతను పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.