విశాఖపట్నం

తాడోపేడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ఎక్సైజ్ శాఖ నిబంధనలకు నీళ్ళొదిలి ఒక మద్యం దుకాణానికి ఇచ్చిన తప్పుడు లైసెన్స్ ఇప్పుడు అది వారి మెడకు చుట్టుకుంది. బడి, గుడికి వంద మీటర్లలోపు మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధనను ఏమాత్రం పాటించకుండా ఎక్సైజ్ సిబ్బంది లైసెన్స్ ఇచ్చింది. దీన్ని నిరసిస్తూ మహిళలు కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నా, ఆ వైన్ షాప్ యాజమాన్యం పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగించింది. ప్రశ్నించిన మహిళలపై పోలీస్ కేసు పెట్టేందుకు యాజమాన్యం వెనకాడలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.
స్థానిక కైలాసపురంలోని సంతోష్‌నగర్‌లో రెండున్నర సంవత్సరాల కిందట జల్సా వైన్స్ ఉండేది. ఇక్కడే ఉన్న వెంకటేశ్వర ఇంగ్లీష్‌మీడియం స్కూల్‌కు ఈ మద్యం దుకాణం చాలా దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంత మహిళలు ఆ షాపును మూసేయాలంటూ ధర్నాకు దిగారు. అయితే, జల్సా వైన్స్ యాజమాన్యం మహళలతో సమావేశమై, ఈ దుకాణం లైసెన్స్‌కు 60 లక్షల వరకూ ఖర్చు చేశానని, ఇప్పుడు కాదంటే, తాను అన్యాయమైపోతామని చెప్పడంతో మహిళలు వెనక్కు తగ్గారు. భవిష్యత్‌లో మళ్లీ ఈ దుకాణానికి లైసెన్స్ రాకుండా చూసుకోవాలని అప్పట్లోనే మహిళలు షరతు విధించారు.
ఈ ఏడాది జూన్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేశారు. మళ్లీ జల్సా వైన్స్ యాజమాన్యానం మరోసారి లైసెన్స్ దక్కించుకుంది. అయితే, ఈ దుకాణాన్ని సీతమ్మధారకు మార్చారు. కొద్ది రోజుల కిందట వేరే పేరుతో సంతోష్‌నగర్‌లో మళ్లీ మద్యం దుకాణం తెరిచేందుకు పాత యాజమాన్యం ప్రయత్నించింది. పైన పేర్కొన్న స్కూల్‌కు దగ్గరగా ఈ మద్యం దుకాణం ఉండడంతో దానికి అనుమతి ఇవ్వబోమని ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి లైసెన్స్ తెచ్చుకుని ఇక్కడ దుకాణం తెరవాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని మహిళలంతా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మొరపెట్టుకున్నారు. ఈనెల 16న ఆయన నేరుగా ఎక్సైజ్ అధికారులను కలిసి, లైసెన్స్ రద్దు చేయమని కోరారు. 17న నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఐదో పట్టణ పోలీసులు, మహిళలు, ఎక్సైజ్ సిబ్బంది సమక్షంలో స్కూల్ నుంచి మద్యం దుకాణానికి కొలతలు తీశారు. స్కూల్ పాలనా భవనానికి 63 మీటర్లు, విద్యార్థులు నడిచి వెళ్లే ప్రాంతానికి 83 మీటర్ల పరిధిలో ఈ దుకాణం ఉందని తేల్చారు. నిబంధనలు పాటించకుండా ఈ దుకాణానికి లైసెన్స్ ఇచ్చిన ఎక్సైజ్ సిబ్బందిని మహిళలు, ఎమ్మెల్యే నిలదీశారు.
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా, శాసనసభలో బిజెపి ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తాను ఒక మద్యం దుకాణంపై ఇచ్చిన ఫిర్యాదును ముఖ్యమంత్రి పట్టించుకోలేదని అన్నారు. తాను ఇచ్చిన లేఖను బుట్టదాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలపై అయిదో పట్టణ పోలీసు స్టేషన్‌లో వైన్ షాప్ యాజమాన్యం కేసు పెట్టిందని అన్నారు. సిఐ కూడా మద్యం దుకాణ యాజమాన్యానికి సహకరిస్తున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేనై ఉండి, అక్రమ అనుమతులతో నడుస్తున్న మద్యం దుకాణాన్ని కూడా మూయించలేకపోతే, తానెందుకని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుకాణాన్ని తెరిస్తే, అక్కడే తాను నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు. మహిళలు కూడా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదియేమైనా ఎక్సైజ్ శాఖ చేసిన తప్పులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాలే ఈ ఉద్రిక్తతలకు కారణమని చెప్పొచ్చు. ఇందుకు బాధ్యులైన వారిపై ఎవరు చర్యలు తీసుకుంటారు?