విశాఖపట్నం

త్వరలోనే వెయ్యి స్టాప్ నర్సుల పోస్టులు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(జగదాంబ), సెప్టెంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పుత్రులకు త్వరలోనే వెయ్యి స్ట్ఫా నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రధాన ఆసుపత్రైన కెజిహెచ్‌కు ఓడిషా, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాల నుంచి ,మిగిలిన ప్రాంతాల నుంచి రోజు అధిక సంఖ్యలో కెజిహెచ్‌కు ఒపి, ఐపి సేవలు పెరుగుతున్న నేపధ్యంలో గత వారం రోజులుగా నగరంలోని టిబి, మెంటల్‌కేర్, విజిహెచ్, ఆర్‌సిడి ఆసుపత్రిల్లో నర్సింగ్ స్ట్ఫా నల్లబ్యాడిజీలు ధరించి నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో విశాఖ పర్యటనకు వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ నెల 19న వెలగపూడిలో చర్చలకు రావాలని కోరారు. దీంతో ఏపి నర్సింగ్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం వెలగపూడిలోని తన కార్యాలయంలో మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ తమ పెండింగ్ సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బోధనాస్పుత్రుల్లో స్ట్ఫా నర్సుల కొరత వున్న మాట వాస్తవమేనని, రెండు,మూడు నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.అదే విధంగా ఏప్పటికప్పుడు టైం బాండ్ పదోన్నతిలు కల్పించేలా చర్చలు తీసుకుంటామని, రీజనల్ డైరక్టెర్ కార్యలయ పరిధిలో సమస్యలను కూడా పరిష్కరించాలని, ఆర్డ్ అధికారి కూడా వారంలో రెండు రోజులు అందుబాటులో వుండే విధంగా చర్చలు తీసుకుంటామన్నారు. అలాగే బిఎస్సి నర్సింగ్ చేసి సర్వీసులో వున్న స్టాప్ నర్సులకు టీచింగ్ ఆసుపత్రిల్లో ముందుగా అవకాశం కల్పించేలా చూస్తామని హమీ ఇచ్చారు. వైద్య విధాన పరిషిత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఏడ్యుకేషన్ పరిధిలల్లో వున్న వారందరీని ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఒకే సారి పదోన్నతిలు, బదిలీలు జరిగేలా చూడాలని సంబంధింత శాఖ అధికారలును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య,విధాన పరిషిత్ కమీషనర్ పి.దుర్గాప్రసాద్‌రావు, డిఎంఈ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ డైరక్టర్ అరుణకుమారి,ఏపి నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు భాగ్యలక్ష్మి,సూభాషిణి, ఎం.ఇందిర,యెస్తేరు, శాంతమ్మ,సుజానమ్మ తదితరలు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణను ఉపేక్షించేది లేదు

ఇంటింటికీ దేశంలో ఎమ్మెల్యే పీలా హెచ్చరిక

అనకాపల్లి, సెప్టెంబర్ 19: ప్రభుత్వ స్థలాల ఆక్రమణను ఉపేక్షించేది లేదని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. ఇంటింటీకి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గొలగాం, కొత్తతలారివానిపాలెం, పాతతలారివానిపాలెం, గుమస్తాల కాలనీ, ఎల్లారమ్మ కాలనీ తదితర గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే పీలా ఎక్కడికక్కడే ఆరాతీసారు. పలుచోట్ల తమ గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని అక్కడి మహిళలు గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురయితే రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించే నోటీసు బోర్డులను ఎక్కడికక్కడే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. గొలగాంలో 15లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని ఏళ్లు గడుస్తున్నా బిల్లులు అందడం లేదని వివిధ ప్రాంతాల మహిళలు ఫిర్యాదు చేయగా చెల్లింపులకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఎల్లారమ్మ కాలనీవాసులు ఎమ్మెల్యేకు ఏకరవుపెట్టారు. తాగునీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లు, వీధి లైట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పించన్‌లు తదితర సమస్యలపై ఎక్కడికక్కడే ప్రజలు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేసారు. ప్రజల వౌలిక వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మండల పరిషత్ అధ్యక్షులు కొణతాల వెంకట సావిత్రి, జెడ్పీటిసి పల్లెల గంగాభవానీ, డాక్టర్ కెకెవిఎ నారాయణరావు, అర్బన్ దేశం ఉపాధ్యక్షులు మళ్ల సురేంధ్ర, జిల్లా దేశం నాయకులు గుత్తా ప్రభాకర చౌదరి, మండల దేశం నాయకులు నడిపల్లి గణేష్, గొలగాం సర్పంచ్ చీకటి రాంబాబు, ఎంపీటిసి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.