విశాఖ

వృద్దాప్య పింఛన్‌కు వయో పరిమితి తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(టౌన్), సెప్టెంబర్ 19: వృద్ధాప్య పింఛన్ మంజూరులో వయో పరిమితిని తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం మండలంలోని గురందొరపాలెంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వృద్ధాప్య పింఛన్ మంజూరుకు ఇప్పటి వరకు 65 సంవత్సరాల వయో పరిమితిని ఐదేళ్ళు తగ్గించి 60 సంవత్సరాలు చేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వయోపరిమితి తగ్గించే విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లాలోని మట్టి రోడ్లు సిసి రోడ్లుగా చేయాలనే లక్ష్యం తనకు ఉండేదన్నారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి తనకు పంచాయతీరాజ్‌గా అవకాశం ఇవ్వడంతో జిల్లాలో90 శాతానికి పైగా సిసి రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 86 పంచాయతీల్లో మట్టి రోడ్లును సి.సి. రోడ్లుగా అభివృద్ధి చేసామన్నారు. గ్రామాల్లో నూటికి 90 శాతం రోడ్లు టిడిపి హయాంలో వేసినవేనన్నారు. గురందొరపాలెం, ఎన్.కొత్తూరుకు 30 లక్షలతో తారు రోడ్డు మంజూరు చేసామన్నారు. పంచాయతీ భవనానికి 15 లక్షలు , స్మశాన వాటిక అబివృద్దికి 10 లక్షలు మంజూరు చేసామన్నారు. అయితే సర్పంచ్ వైపాకాకు చెందిన వ్యక్తి కావడంతో పంచాయతీ భవన నిర్మాణానికి తీర్మానం చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. రావణాపల్లి రిజర్వాయర్ నుండి చెట్టుపల్లికి నీరందించేందుకు లైనింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుందని,త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా మరో ఆరువేలు కలిపి ఏడువేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయా లేదా తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో అర్హులెవ్వరూ మిగల కూడదనేదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు మరిచిపోరన్నారు. కాపు కార్పొరేషన్‌కి వెయ్యి కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ లాలం భవానీ భాస్కర్, ఎం.పి.పి. సుకల రమణమ్మతో కలిసి మంత్రి గ్రామంలో పర్యటించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి, ఎం.పి.టి.సి. రాయివరలక్ష్మి,టిడిపి నాయకులు ఆర్. పెదబాబు, ఈర్లె రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.