విశాఖపట్నం

పర్యావరణరహిత సాంకేతికత వినియోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: పర్యావరణరహితంగా సాంకేతికను తీర్చిదిద్ది ఉపయోగించాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఫార్చూన్ శ్రీకన్య హోటల్‌లో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండీషనరింగ్ ఇంజనీర్స్ (ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఇ) విశాఖ ప్రాంతీయ కేంద్రం నిర్వహించిన ఉర్జావరన్ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికలు అవసరం ఏర్పడుతోందన్నారు. ఇదే సమయంలో సాంకేతికత కాలుష్యం పెరగడానికి సైతం కారణంగా మారుతోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వినియోగదారులకు సాంకేతికతను చేరువ చేసే విధంగా ఏర్పాటు చేసిన ఉర్జావరన్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఇటువంటి సాంకేతిక సదస్సులు నూతన ఆవిష్కరణలకు మార్గాలను చూపుతాయన్నారు. ఇష్రే ప్రాంతీయ కేంద్రం అధ్యక్షులు ఆచార్య కె.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనరింగ్, రిఫ్రిజిరేషన్ (హెచ్‌విఏసిఆర్) రంగం, అర్చిటెక్‌లు, నిర్మాణదారులు, కన్సల్టెంట్‌లు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని సదస్సులో పంచుకోవడం జరుగుతుందన్నారు. సదస్సులో మేథో ప్రసంగాలు, వస్తు ప్రదర్శనలుర్పాటు చేసామన్నారు. భవనాల్లో ఇంధన వనరుల ఆదా చేయడం, సౌవ వ్యవస్థ ఏర్పాటు, హరిత భవనాలు, శీతలీకరణ వ్యవస్థ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా నిపుణుల ప్రసంగాలు, చర్చలు ఉంటాయన్నారు. మేథో మధన వేదికగా ఉర్జావన్‌ను నిలుస్తుందన్నారు. పర్యావరణ హితంగా నడుచుకోవడం, దీనికి ఉపయుక్తమైన సాంకేతికలు అభివృద్ధి చేయడం, అగ్నిప్రమాదాల నియంత్రణ, భవనాల అటోమేషన్, ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, వాటర్ ట్రీట్‌మెంట్, ఎలక్ట్రికల్స్ తదితర అంశాలపై సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. సాంకేతిక, ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. సుస్థిర భవనాల నిర్మాణం పర్యావరణ హిత విధానాలను అవలంబించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం దేశం నలుమూలల నుంచి విచ్చేసిన నిపుణులు పలు సాంకేతిక అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బి.మధుఉర్జావన్,కన్వీనర్ విద్యాసాగర్, కార్యదర్శి జేమ్ ఆనంద్, కోశాధికారి డి.ఎస్.ఎన్ మూర్తి పాల్గొన్నారు.