విశాఖపట్నం

న్యాయ వాదులు వృత్తిలో విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: న్యాయవాదులు వృత్తిలో విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేరళ హైకోర్టు న్యాయమూర్తి డి శేషాద్రి నాయుడు అన్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న న్యాయవాదులు పునశ్చరణ తరగతులను స్థానిక వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తిలో పలు అంశాలను ఆకళింపు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా తమను నమ్మి వచ్చిన కక్షిదారులకు న్యాయం చేయగమన్న నమ్మకంతో పనిచేయాలని సూచించారు. కేసు పూర్వాపరాలను వివరించే సందర్భంలో కక్షిదారు వెళ్లడించే ప్రతి అంశాన్ని ఆలకించాలని, కేవలం తమకు అవసరమైన ప్రశ్నలు వేసి, వివరాలను రాబట్టే క్రమంలో విఫలం కారాదన్నారు. కేసు పరిశీలనలోనే గతంలో ఇటువంటి కేసుల్లో వెలువడిన తీర్పులను స్పురణకు తెచ్చుకోవాలన్నారు. దీనికి నిరంతర పఠనం అవసరమన్నారు. అలాగే న్యాయ స్థానంలో వాద,ప్రతివాదల సందర్భంలో ఎక్కడా తడబాటు పనికిరాదన్నారు. న్యాయమూర్తి అడిగే ప్రతి అంశానికీ వివరణాత్మక సమాధానం ఇచ్చేలా కేసును సిద్ధం చేసుకోవాలన్నారు.
అనంతరం ప్రముఖ న్యాయవాది సార్వభౌమరావు రుణాల ఎగవేత తదితర అంశాల్లో న్యాయవాదులు కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.