విశాఖపట్నం

వాస్తవానికి దగ్గరగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 15: విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. రెండో రోజు కార్యక్రమంలో శ్రీలంక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మోహన్ పెరీస్ పాల్గొని న్యాయవాదులు అనుసరించాల్సిన బాధ్యతలపై ప్రసంగించారు. అనంతరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి వి కేశవరావు ‘న్యాయవాది - ఏడు ప్రశ్నలు అనే అంశంపై ప్రసంగించారు. న్యాయవాద వృత్తి వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నారు. కేసులు విచారించే తీరును వివరించారు. అవకాశాలు అందరికీ వస్తాయని, అయితే వినియోగించుకునే తీరులో మార్పు అవసరమన్నారు. సాక్షులను విచారించే తీరు, న్యాయస్థానంలో ప్రవర్తన, న్యాయాధికారితో మాట్లాడే తీరుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతిక, సరళీకృత విధానాల వల్ల న్యాయవాదులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సీనియర్ న్యాయవాది వి రవీంద్ర ప్రసాద్ ‘మధ్యవర్తిత్వం - కార్యరూపం’ అంశంపై ప్రసంగించారు. సమయాభావం, ఆర్థిక భారం వంటి కారణాల వల్ల కక్షిదారులు సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారన్నారు. చిన్నచిన్న వివాదాలు, ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం కీలకంగా పనిచేస్తాయన్నారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై పట్టు సాధించాలన్నారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు పి బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఏజెన్సీ పిహెచ్‌సిల్లో అటెండర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం‚
విశాఖపట్నం(జగదాంబ), అక్టోబర్ 15: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో వున్న గిరిజన ప్రాంత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మన్, మేల్ నర్సింగ్ ఆర్డర్ (ఎం.ఎన్.ఒ) పోస్టులకు అర్హత గల గిరిజన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21 వరకూ దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర వీరాంజనేయ అవుట్ సోర్సింగ్ సంస్ధ నిర్హాకులు ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపడుతున్నామన్నారు.
శానీటరీ అటెండరీ కమ్ వాచ్‌మెన్ పోస్టుకు ఏడోవ తరగతి ఉత్తీర్ణులై వుండాలని వీరికి రూ.12 వేలు జీతం అందిస్తారన్నారు. అలాగే ఎం.ఎన్.ఓ పోస్టుకు ఎనిమిదో తరగతి పాసై, ఫస్ట్‌యిడ్ సర్ట్ఫికేట్ కోర్సు కలిగి వుండాలన్నారు. అర్హులైన గిరిజన ప్రాంత అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అన్ని విద్యార్హతల సర్ట్ఫికేట్‌లను, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలన్నారు.
దరఖాస్తులను నిర్ణీత గడువులోగా డర్ నెంబర్ 25-9-15, షణ్ముఖ పారడైజ్, రాజావారి వీధి,కురపాం మార్కేట్ , విశాఖపట్నం-530001 అడ్రస్సుకు దరఖాస్తులను పంపాలన్నారు.

న్యాయవాది రాజ్యాంగ రాయబారి

విశాఖపట్నం, అక్టోబర్ 15: రాజ్యాంగ ఫలాలు పౌరులకు చేరడంలో రాయబారిగా వ్యవహరించేంది న్యాయవాది మాత్రమేనని శ్రీలంక సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహన్ పెరీస్ అన్నారు. సిరిపుర వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయవాద వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం రెండోరోజు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎదుగుదల నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. న్యాయవాద వృత్తిలో సాంకేతికత, న్యాయ విజ్ఞానం, కేసు విచారణ, న్యాయస్థానంలో ప్రవర్తించే తీరు తదితర అంశాలు న్యాయవాది గొప్ప స్థాయికి ఎదిగేందుకు దోహదం చేస్తాయన్నారు.
దేశంలో అతితక్కువ మందికే రాజ్యాంగం ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం అతితక్కువ మందికి మాత్రమే లభిస్తుందని, న్యాయవాద వృత్తిలో లభించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాద వృత్తి దేముడు ఇచ్చిన వరంగా భావించాలని, సక్రమ మార్గంలో కొనసాగుతూ న్యాయాన్ని రక్షించేందుకు న్యాయవాదులు నిరంతరం శ్రమించాలన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే న్యాయవాద వృత్తి భిన్నమైందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా న్యాయవాది ప్రతిరూపంగా నిలవాలన్నారు. కక్షిదారు కేసులు అర్ధం చేసుకుని, విచారణ సమయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. నైతిక విలువలు న్యాయవాద వృత్తికి వెలుగునిస్తాయని పేర్కొన్నారు. ప్రాధమిక సూత్రాలు, అర్హత, కోర్టులో ప్రవర్తించే తీరు, ప్రధానమైందన్నారు. ఇదే సందర్భంలో పాశ్చాత్య దేశాల్లో న్యాయస్థానాల తీరును విశదీకరించారు. అన్ని కేసులు విచారించాల్సిన అవసరం లేదని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలన్నారు. న్యాయవాద వృత్తిలో ఎదుగుదలకు 10 సూత్రాలను వివరించారు.అనంతరం జస్టిన్ మోహన్ పెరీస్‌ను న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర రావు, ప్రతినిధులు బలగ సత్యారావు, ఎ అప్పారావు, తదితరులు సత్కరించారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి వి కేశవరావు, అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో రవిబాబు, భూపతిరాజు?
విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 15: రౌడీషీటర్ కొప్పర్ల సత్యనారాయణరాజు అలియాస్ గేదెలరాజు హత్య కేసులోని ప్రధాన నిందితులు దాసరి రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు పోలీసుల అదుపులో ఉన్నట్టు ఆదివారం విశ్వసనీయంగా తెలిసింది. వీరిని మీడియా కంట పడనీయకుండా నేడో, రేపో కోర్టులో హాజరు పరచడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు బోగట్టా. దాసరి రవిబాబు ఎంతైన పోలీసు శాఖలో ఇప్పటి వరకు విధులు నిర్వహించాడు కాబట్టి, ఆ స్వాభిమానంతో అతనిని విలేఖరుల ముందు హాజరు పరచకుండా నేరుగా కోర్టుకు పంపించి, తద్వారా జైలుకు పోలీసులు తరలించనున్నట్టు తెలిసింది.
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె పద్మలతను హత్య చేయించడంలోను, రౌడీషీటర్ గేదెలరాజును అంతమొందించడంలోను ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్‌పి దాసరి రవిబాబు హస్తమున్నట్టు పోలీసులు తేల్చడంతో ఇక చేసేది లేక రవిబాబు పోలీసులకు లొంగిపోయినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన నిందితుడైన రవిబాబు న్యాయపరమైన సలహాలు తీసుకుని పోలీసుల ముందు ప్రత్యక్షమైనట్టు తెలిసింది. గేదెలరాజును హత్య చేయించిన అనంతరం విజయవాడ పారిపోయిన రెండో నిందితుడైన క్షత్రియభేరి పత్రిక అధినేత భూపతిరాజు శ్రీనివాసరాజును ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే అదుపులోకి తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం రవిబాబును, భూపతిరాజును ఓ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది.
కీలక పాత్ర వహించాడు. సబ్బవరంలోని గాలి భీమవరం శివారు ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం గాజువాకకు చెందిన రౌడీషీటర్ గేదెలరాజని తేలడంతో టాస్క్ఫోర్స్ పోలీసులను సిపి యోగానంద్ రంగంలోకి దింపారు.దీంతో గేదెలరాజు సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్‌డేటాను పరిశీలించాల్సిందిగా టాస్క్ఫోర్స్ ఎసిపి ఐ.చిట్టిబాబు, తన స్టేషన్‌లోని కానిస్టేబుల్‌కు
గేదెలరాజుకు వచ్చిన చివరి కాల్ భూపతిరాజుదని గుర్తించారు. భూపతిరాజు సెల్‌ఫోన్ నుండి ఆదర్శనగర్‌కు చెందిన రౌడీషీటర్ సువ్వాడ మహేష్ ఫోన్‌కు కాల్స్ వెళ్లినట్టు గుర్తించి, అతని సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా గరివిడిలో ఉన్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు గమనించారు. వెంటనే అక్కడకు వెళ్లి మహేష్‌తో పాటు మరో ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో గేదెలరాజు హత్య వెనుక దాసరి రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసు చిక్కుముడి వీడిపోయినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.

శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇందిర హయాం స్వర్ణయుగం

విశాఖపట్నం, అక్టోబర్ 15: శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రధానిగా దివంగత ఇందిరాగాంధీ పనిచేసిన కాలం స్వర్ణయుగమని డిఆర్‌డిఓ శాస్తవ్రేత్త డాక్టర్ సిద్దార్ధ అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శాస్త్ర,సాంకేతిక రంగాలపై ఆదివారం నాడిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర ప్రధానిగా పనిచేసిన కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేశారన్నారు. ఆమె హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు ప్రస్తుతం దేశానికి రక్షణగా నిలుస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్‌తో యుద్ధానంతరం అణుసబ్‌మెరైన్‌ను రూపొందించాలని నిర్ణయించారన్నారు. తుపాన్లు, ఇతర విపత్తులను ముందుగా పసిగట్టే రాడార్ వ్యవస్థను నెలకొల్పిన ఘనత ఇందిరకే దక్కుతుందన్నారు. రాజకీయంగా ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ దేశంలో రాడార్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంలో వెనుకడుగు వేయలేదన్నారు. దేశ రక్షణకు స్వశక్తిపై నిలవాలన్నదే ఇందిర లక్ష్యంగా పనిచేశారన్నారు. అలాగే శాస్తవ్రేత్తలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు విద్యలో, పాఠ్యాంశాల్లో అంతర్భాగం కావాలని పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. నాలుగు దశాబ్ధాల కిందటే శాస్త్ర, సాంకతిక రంగాలను ఉపయోగించుకుంటూ దేశాభివృద్ధికి బాటలు వేశారన్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే సాంకేతిక విప్లవం తీసుకువచ్చారన్నారు. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పరిపాలనా దక్షత, సంస్కరణలతో ఇందిరాగాంధీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఇందిరాగాంధీ, దేశ రక్షణ, అభివృద్ధికి దోహదం చేసే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా అట్టడుగు వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇందిరా గాంధీ శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రసంగించారన్నారు. తరువాత 1975లో విశాఖలో జరిగిన మరో కార్యక్రమంలో గ్రామీణ ఇంజనీరింగ్ అవసరంపై ప్రసంగించారన్నారు. ఇందిరాగాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే శాస్త్ర, సాంకేతిక రంగాలకు పెద్ద పీట వేశారన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, టెలికాం రెగ్యురేటరీ అథారిటీ (ట్రాయ్) మాజీ సభ్యురాలు విజయలక్ష్మి గుప్త, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు.

17న సిఎం రాక
* ఆనంద దీపావళికి హాజరు

విశాఖపట్నం, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17న నగర పర్యటన ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు ఆవరణలో నిర్మించిన నూతన వివిఐపి లాంజ్‌ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి ఎన్‌ఎడి కొత్తరోడ్డులో వుడా నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 5.40 గంటలకు బీచ్‌రోడ్డులోని టియు-142 యుద్ధ విమాన మ్యూజియం పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి ఆర్కే బీచ్‌లో నిర్వహించే ఆనంద దీపావళి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆర్కే బీచ్‌లో గడుపుతారు. అక్కడ నుంచి బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

కథాసాహిత్యంలో మణిపూస
‘వందేళ్ల కథకు వందనాలు’
విశాఖపట్నం (కల్చరల్), ఆక్టోబర్ 15: తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలు అనదగ్గ కథలతో ‘వందేళ్ల కథకు వందనాలు’ పుస్తకం రూపొందిందని ప్రముఖ నాటక రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీ రావు అన్నారు. సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ వివరాలను వెల్లడించారు. 1346 పుటలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న పుస్తకంలో 116 కథలు, 500 వర్ణచిత్రాలు నిక్షిప్తమై ఉన్నాయన్నారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత విజయ్‌కుమార్ సౌజన్యంతో పుస్తకం రూపుదిద్దుకుందన్నారు. రచయిత సూరిబాబు చక్కని పనితీరుతో ముద్రణ పనులు పర్యవేక్షించారన్నారు. నవంబర్ తొలి వారంలో హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో గోకుల్ చంద్, రాహుల్ చంద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఎండి ఎస్ విజయకుమార్, సూరిబాబు పాల్గొన్నారు.
న్యాయవాదులు

పరస్పర సహకారంతో అభివృద్ధి
విశాఖపట్నం (కల్చరల్), అక్టోబర్ 15: వ్యాపారాభివృద్ధిలో పరస్పరం సహకరించుకుంటూ సమాజ శ్రేయస్సుకు తమ వంతు సాయపడటమే తమ ధ్యేయమని బిఎన్‌ఐ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆదివారం సాగరతీరంలోని ఒక హోటల్‌లో డిజాక్ పేరిట సభ్యుల సమ్మేళనం పెద్దఎత్తున నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 300 వృత్తులకు చెందిన రెండు లక్షల 22వేల 575 మంది సభ్యులున్నారన్నారు. మన దేశంలో 375 చాప్టర్స్‌తో 17వేల మంది సభ్యులున్నారన్నారు. గతేడాది ఐదు కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. చిన్న,సన్నకారు వ్యాపారులకు తాము బాసటగా నిలిచి తమ సభ్యుల వస్తు, సేవల మార్పిడి ద్వారా వారు అభివృద్ధి పధాన పయనించేలా కృషి చేస్తామన్నారు.

వాస్తవికతే ప్రామాణికం

విశాఖపట్నం, అక్టోబర్ 15: విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. రెండో రోజు కార్యక్రమంలో శ్రీలంక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మోహన్ పెరీస్ పాల్గొని న్యాయవాదులు అనుసరించాల్సిన బాధ్యతలపై ప్రసంగించారు. అనంతరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి వి కేశవరావు ‘న్యాయవాది - ఏడు ప్రశ్నలు అనే అంశంపై ప్రసంగించారు. న్యాయవాద వృత్తి వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నారు. కేసులు విచారించే తీరును వివరించారు. అవకాశాలు అందరికీ వస్తాయని, అయితే వినియోగించుకునే తీరులో మార్పు అవసరమన్నారు. సీనియర్ న్యాయవాది వి రవీంద్ర ప్రసాద్ ‘మధ్యవర్తిత్వం - కార్యరూపం’ అంశంపై ప్రసంగించారు. సమయాభావం, ఆర్థిక భారం వంటి కారణాల వల్ల కక్షిదారులు సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారన్నారు. చిన్నచిన్న వివాదాలు, ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం కీలకంగా పనిచేస్తాయన్నారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై పట్టు సాధించాలన్నారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు పి బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.