విశాఖపట్నం

తీరంలో మరో పర్యాటకాకర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: సాగర తీరంలో మరో పర్యాటకాకర్షణ ప్రాజెక్టు త్వరలోనే సందర్శకులను ఆకట్టుకోనుంది. దశాబ్ధాలుగా భారత రక్షణ రంగంలో సేవలందించి, ఇటీవలే సేవల నుంచి ఉపసంహరణ పొందిన టియు-142 యుద్ధ విమానం తీరంలో కొలువు తీరనుంది. ఇప్పటికే యుద్ధ విమానాన్ని విశాఖ తరలించి, ఆర్కే బీచ్‌లోని కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద ఏర్పాటు చేశారు. యుద్ధ విమానాన్ని ఉంచిన ప్రాంతాన్ని అత్యంత సుందరంగాను, ఆహ్లాదకరంగాను తీర్చిదిద్దే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. మన దేశ రక్షణ రంగంలో సేవలందించిన కురుసుర సబ్‌మెరైన్‌ను సేవల అనంతరం తీరంలోనే ఉంచి సందర్శకుల కోసం తీర్చిదిద్దిన క్రమంలోనే, యుద్ధ విమానాన్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యుద్దరంగంలో ఎంతగానో సేవలందించి, పలు చారిత్రాత్మక విజయాలను అందించిన సబ్‌మెరైన్, యుద్ధ విమానాలను స్వయంగా చూడటం, వాటి పనితీరును తెలుసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలు భారతదేశ యుద్ధ పటిమను, సబ్‌మెరైన్‌లు, యుద్ధ విమానాలు అందించిన సేవలను సందర్శకులకు కళ్లకు కట్టినట్టు చూపనున్నారు. తాజాగా నెలకొల్పుతున్న టియు-142 యుద్ధ విమానం ద్వారా విశాఖకు పర్యాటకంగా మరింత వనె్న తెస్తుందనడంలో సందేహం లేదు.

ఎన్‌ఎడి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
నగరంలో ప్రధాన కూడలి ఎన్‌ఎడి జంక్షన్ మీదుగా ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి. గాజువాక, పెందుర్తి,మర్రిపాలెం,గురుద్వారా ప్రాంతాలను కలిపే ఈ జంక్షన్‌లో నిత్యం వేలాది వాహనాలు నడుస్తుంటాయి. ఉదయం, సాయంత్రం వంటి రద్దీ వేళల్లో ఇక్కడ ట్రాఫిక్ సమస్య చెప్పనలవి కాదు. ఈ తరుణంలో ఎన్‌ఎడిలో రోటరీ మోడ్ సపరేటర్ తరహాలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.113 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లై ఓవర్‌ను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న విజయ్ నిర్మాణ్ కంపెనీ రెండేళ్లలో ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయనున్నారు. భవిష్యత్‌లో నిర్మించబోయే మెట్రోరైల్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. ఈ రెండు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో నిర్మించిన వివిఐపి లాంజ్‌ను చంద్రబాబు ప్రారంభిస్తారు.

ఆనంద దీపావళి
తొలిసారిగా కాలుష్యరహిత, పర్యావరణ హిత దీపావళికి వినూత్న రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. అనాధ బాలలతో కలిసి సాగరతీరంలో ఆనంద దీపావళి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారు రెండు వేల మంది మూగ, బధిర, అంధ, అనాధ బాలలతో కలిసి ఆనందదీపావళి జరుపుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఆనంద దీపావళిలో శబ్ధాలకు తావు లేకుండా కేవలం రంగులు వెదజల్లే బాణసంచా మాత్రమే కాలుస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల వేడుకల సందర్భంగా నగరంలోని పలు స్టార్ హోటళ్ల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంట రుచులతో పాటు ప్రఖ్యాత షాపింగ్ మాల్స్ తమ స్టాళ్లలో రాయితీపై సందర్శకులను ఆకట్టుకోనున్నారు.