విశాఖ

సరిహద్దులో టెన్షన్..టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 16: ఏడాదిగా సబ్దతగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా అలజడి సృష్టిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గూడెంకొత్తవీధి మండలం దారకొండ వద్ద బి. ఎస్. ఎన్. ఎల్. సెల్ టవర్‌ను దగ్ధం చేసిన మావోయిస్టులు సోమవారం తెల్లవారు జామున ఏజన్సీ వ్యాపారిని హతమార్చి తమ ఉనికిని చాటుకున్నారు. ఈనేపధ్యంలో మావోయిస్టులను మట్టుపెట్టేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు విధ్వంసాలకు ,హత్యలకు పాల్పడుతున్నారని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతుంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆంద్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తే ఎ. ఓ.బి.లో ఏడాది పాటు వౌనంగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. మన్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈపరిస్థితుల్లో వారికి అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రిందట ఎ. ఓ.బి.లో 31 మంది మావోయిస్టులను హతమార్చిన సంఘటన మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. క్యాడర్ మొత్తం చిన్నాభిన్నమైంది. దళకమాండర్లు, కీలక నేతలు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ నడిపించే వారు కరవయ్యారు. దీంతో ఏడాదిగా మావోయిస్టుల కదలికలు ఎక్కడా కనిపించలేదు. అయితే విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం మళ్ళీ అలజడి సృష్టించారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన కొందరు మావోయిస్టులు పానుభూతి పరులతో కలిసి దారకొండలో బి. ఎస్. ఎన్. ఎల్. టవర్‌ను దగ్ధం చేసారు. తాజాగా కోరుకొండలో ఏజన్సీ వ్యాపారిని హతమార్చారు. ఈసంఘటనలతో ఏజన్సీ ప్రాంతం ఉలిక్కి పడింది. ఈసంఘటనలో మావోయిస్టులు కరపత్రాలను కూడా విడుదల చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. ముందుముందు గిరిజనులకు వ్యతిరేకంగా వ్యహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈసంఘటనలో పోలీసులు అప్రమత్తమై మావోయిస్టులను మరోసారి దెబ్బతీయడానికి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగురోజుల క్రితం ఆంధ్రా- ఒడిషా , చతీష్‌ఘడ్, తెలంగాణా పోలీసు బాసులు రహస్యంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతంలోని భారీగా బలగాలను మోహరించాయి. దీంతో ఏజన్సీ ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. కొరుకొండ ప్రాంతంలో గిరిజన వ్యాపారి హత్య జరగడంతో ఆ కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ఒక పక్క పోలీసులు బూట్ల చప్పుళ్ళు, మరో పక్క హత్యలు, విధ్వంసాలతో ఎప్పుడేం జరుగుతోందనని ఏజన్సీ ప్రాంతాల గిరిజనులు వణికిపోతున్నారు.

ఎఒబిలో అప్రమత్తత
సీలేరు, అక్టోబర్ 16: రామగూడ ఎన్‌కౌంటర్ జరిగి ఏడాది అవుతున్న తరుణంలో మావోయిస్టులు చెలరేగి ఎ. ఓ.బి.లో విధ్వంస ఘటన జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈనేపధ్యంలో సరిహద్దుల్లో పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసారు. గత ఏడాది అక్టోబర్ 24న ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లాలో బెజ్జంగి అటవీ ప్రాంతంలో రామగూడ వద్ద మావోయిస్టులు ప్లీనరీ సమావేశాలు జరుగుతుందనే పక్కా సమాచారం పోలీసులు మావోలను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈఘటనలో 30 మంది మావోలు మృతి చెందారు. దీంతో రగులుతున్న మావోలు ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహరచన చేస్తుండడంతో వారి కార్యకలాపాలు నిరోధించేందుకు పోలీసులు బలగాలను మోహరించి గాలింపును ముమ్మరం చేసారు. ముందుగా మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునే విధంగా దారకొండలో సెల్‌టవర్ ఫ్యానల్ బోర్డును కాల్చి పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటుటవంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈనేపధ్యంలో సీలేరులో స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.