విశాఖపట్నం

భూ కబ్జాకు సహకరించిన రిటైర్డ్ రిజిస్ట్రార్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: భూ కబ్జాదారుడికి సహకరించిన జిల్లా రిటైర్డ్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లను పి.ఎం.పాలెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన వివరాలివి. చినగదిలి మండలం విశాఖ వ్యాలీ స్కూల్ సమీపంలోని సర్వే నెంబర్ 124ఏ లోని 24.42 ఎకరాల భూమిని 1990మార్చి 15వ తేదీన విజయనగరం మహారాజు పి.వి.జి.రాజు చేకూరి సుధాకరరాజు తండ్రి పూర్ణచంద్ర రాజుకు అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించినట్టు పత్రాలు సృష్టించారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంతిన దశరథ మహారాజు, పి.రామరాజుకు సుధాకరరాజు విక్రయించజూపాడు. దీనికి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాలిడేషన్ చేయాలని, ఇందుకోసం మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఎనిమిది ఎకరాలు ఇస్తామని సుధాకరరాజు చెప్పారు. 2010లో అప్పటి జిల్లా రిజిస్ట్రార్ పడాల వెంకటేశ్వరరావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి.వి.ఎస్.ఎన్.సత్యనారాయణరావుతో కలిసి కుట్ర పన్ని 2010 జూన్ 12వ తేదీన దశరథ మహారాజు, రామరాజుతో కలిసి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సుధాకరరాజు వెళ్లారు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వ్యాలిడేషన్ చేయడానికి స్టాంప్ డ్యూటీ, అపరాధ రుసుం కింద కోటి రూపాయలు ఖర్చవుతుందని సుధాకరరాజు వారికి చెప్పారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్ దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్ట్ హోటల్‌కు వెళ్లి రామరాజు, దశరథ మహారాజు నుంచి కోటి రూపాయలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల తరువాత సదరు అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను వ్యాలిడేషన్ చేయించారు. సుధాకరరాజు విక్రయించాలనుకున్న భూమి మొత్తం ప్రభుత్వానికి చెందినదే అయినా, జిల్లా రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆ విషయాన్ని కప్పిపుచ్చి, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సేల్ డీడ్‌కు వ్యాలిడేషన్ చేశారు. స్టాంప్ రుసుం కోసం కోటి రూపాయలు వసూలు చేసి, లక్షా 70 వేల రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారు. సుమారు 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వేరొకరి పేరున మార్పు చేసి, దానిని అన్యాక్రాంతం చేసేందుకు సహకరించినందుకు రిటైర్డ్ జిల్లా రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో సుధాకరరాజును అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు సత్యనారాయణరావు, వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు.