విశాఖపట్నం

రవిబాబు అంటే పద్మలతకు పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: పద్మలత, గేదెల రాజు హత్య కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. పాయకరావుపేట ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె పద్మలత, రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే గేదెల రాజు హత్య కేసులో ఏ1గా ఉన్న రవిబాబు, ఇప్పుడు పద్మలత అనుమానాస్పద మృతి కేసులో కూడా ఆయన ప్రధాన నిందితుడు కాబోతున్నాడా? లేక తెలివిగా తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పద్మలత తండ్రి నూకరాజు సోమవారం నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి, తన కుమార్తెను విషమిచ్చి చంపేశారని, దీనిపై తాను ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పడంతో మంగళవారం ఏసిపి రంగరాజు, క్రైం డిసిపి రవికుమార్ మూర్తి మర్రిపాలెంలో ఒక ఇంట్లో ఉన్న నూకరాజు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అలాగే, పద్మలతకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి కెజిహెచ్‌లో చేరినప్పుడు ఆమెకు సేవలందించిన కృష్ణ అనే ఆమెను కూడా పోలీసులు మంగళవారం విచారించారు. ఈ విచారణ అనంతరం నూకరాజు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు.
యలమంచిలి సిఐగా రవిబాబు ఉన్నప్పుడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కుమార్తె పద్మలత ఆయన దగ్గరకు వెళ్లేదని నూకరాజు చెప్పారు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగిందని అన్నారు. చివరకు రవికుమార్‌ను వివాహం చేసుకునేందుకు తన కుమార్తె సిద్ధపడిందని, అందుకు తాను అంగీకరించలేదని నూకరాజు చెప్పారు. తన కుమార్తె, తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు రవికుమార్ సహకారం కూడా తీసుకుందని చెప్పారు. కొంత కాలం తరువాత తమ అల్లుడు చనిపోయాడని, ఆ తరువాత పిల్లాడిని చూసుకుంటూ, వివిధ పనుల్లో పడి తన కుమార్తె, రవికుమార్‌ను మరిచిపోయిందని చెప్పుకొచ్చారు. దాదాపూ ఆరు, ఏడు సంవత్సరాల తరువాత కశింకోటకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు కళ్యాణి తన ఇంటికి వచ్చిందని చెప్పారు. రెండు, మూడుసార్లు ఆమె మా ఇంటికి వచ్చిందని అన్నారు. ఒక రోజు ఇంట్లో చెప్పకుండా తన కుమార్తె కశింకోట వెళ్లిపోయిందని, అక్కడి నుంచి కళ్యాణి సహకారంతో డిజిపిని కలిసేందుకు వెళ్లారని నూకరాజు వివరించారు. రవిబాబు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో రవిబాబును కొంత కాలం సస్పెండ్ కూడా చేశారని నూకరాజు వివరించారు. తన కుమార్తె చర్యలను తాను అప్పటికీ వ్యతిరేకిస్తూ వచ్చానని, అనవసరంగా రవిబాబు జీవితం నాశనమైపోతోందని బాధ పడ్డానని నూకరాజు అన్నారు. తమ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఆమె మనసు మార్చాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, రవిబాబుతోనే తాను జీవిస్తానని మొండికేసిందని చెప్పారు. ఒక రోజు తన కుమార్తె కశింకోటలోని కళ్యాణి ఇంటికి వచ్చిందని, అప్పుడు నెంబర్ లేని కారులో రవిబాబు ఆమె ఇంటికి వచ్చారని నూకరాజు చెప్పారు. కళ్యాణి, రవిబాబు మాట్లాడుకున్న మాటలను విన్న తన కుమార్తె కళ్యాణిపై ఆగ్రహంతో బయటకు వచ్చేసిందని చెప్పారు. కశింకోట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన కుమార్తెను కొంతమంది తీసుకువచ్చి తన ఇంట్లో విడిచిపెట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాల మహానాడు నాయకులు తన ఇంటికి వచ్చి తనకు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, అదే సమయంలో తొలిసారిగా గేదెల రాజు తన ఇంటికి వచ్చాడని నూకరాజు వివరించారు. అప్పుడు పరిచయమైన గేదెల రాజు తరచు తన ఇంటికి వచ్చి వెళ్లే వాడని అన్నారు. ఒక దశలో తన కుమార్తె వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడని అన్నారు. ఇదే సమయంలో విశాఖ రూరల్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది జోక్యం చేసుకుని, తన కుమార్తె జీవితాన్ని ఏదో విధంగా చక్కదిద్దాలని చూశారని, ఇందుకోసం ఓ 50 లక్షల రూపాయలను కూడా ఇవ్వచూపినట్టు తనకు ఈ మధ్యే తెలిసిందని చెప్పారు. ఈ మొత్తాన్ని రవిబాబు ద్వారా ఇప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇంత జరుగుతున్నా, రవిబాబును ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తన కుమార్తె ఉందని అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో తన కుమార్తె తాను రవిబాబుతోనే తిరిగి వస్తానని ఇంటి నుంచి వెళ్లిపోయిందని నూకరాజు వెల్లడించారు. ఆ తరువాత ఆమె మహిళా చేతన నాయకురాలు పద్మ ఇంట్లో కొద్ది రోజులు ఉందని చెప్పారు. ఇదే సమయంలో గేదెల రాజు తన ఇంటికి వచ్చి, తన కూతురి భవిష్యత్ గురించి మాట్లాడాడని నూకరాజు చెప్పారు. విశాఖలో ఉన్న తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేయమని చెప్పానని, సరేనని గేదెల రాజు వెళ్లిపోయాడని తెలిపారు. తన కుమార్తెను పద్మ ఇంటి నుంచి తీసుకుని గాజువాకలోని ఆల్ఫా హోటల్‌లో బిర్యాని తినిపించాడని నూకరాజు చెప్పారు. వెంటనే ఆమెను కారు ఎక్కించుకుని తమ గ్రామానికి బయల్దేరాడని చెప్పారు. మార్గ మధ్యంలో కారుకు డీజిల్ కొట్టించేందుకు పెట్రోలు బంకు వద్ద ఆపాడు. ఈ నేపథ్యంలో కారులో ఉన్న తన కుమార్తె కిందకు దిగి వాంతులు చేసుకుని, కుప్ప కూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు కారును వెంబడించి, గేదెల రాజుకు ఆమెను అప్పగించారు. తన కుమార్తెను స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చేర్చుకోమంటే, కెజిహెచ్‌కు తీసుకువెళ్లారు. భర్త, లేదా తండ్రి ఉంటేనే చేర్చుకుంటామని డాక్టర్లు చెప్పడంతో, ఆ విషయాన్ని రాజు తనకు తెలియచేశాడని నూకరాజు వెల్లడించారు. వెంటనే కెజిహెచ్‌లో పనిచేస్తున్న కృష్ణ అని తన మేనకోడలను పంపించానని నూకరాజు చెప్పారు. తన కుమార్తె వాంతుల చేసుకున్నప్పుడు ఆ వాసన భరించడం ఎవరి శక్యం కాదని అన్నారు. తను, తన భార్య ఆసుపత్రికి వెళ్లి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశావని ప్రశ్నించామని, తను మందు తీసుకోలేదని చెప్పిందని తెలిపారు. గేదెల రాజు కూడా తనను ఆల్ఫా హోటల్‌కు తీసుకువెళ్లి, సిసి కెమేరా ఫుటేజ్ కూడా చూపించాడని చెప్పారు. ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన తరువాత కూడా తన కుమార్తె తన ఇంటికి రావడానికి ఇష్టపడలేదని, తను రవిబాబుతోనే వస్తానని మొండికేసిందని అన్నారు. ఆ తరువాత 15 రోజులపాటు ఆమె గేదెల రాజు ఇంట్లోనే ఉంది. అప్పటికే ఆమె చాలా నీరసించిపోయింది. తన కుమార్తెకు నర్సీపట్నం వద్ద తాయెత్తు కట్టించడానికి తీసుకువెళ్లారని, ఆమె పరిస్థితి బాగులేకపోయినా, తనకు చూపించకుండానే, తన ఇంటి ముందు నుంచే కారులో వేగంగా తీసుకువెళ్లారని నూకరాజు వివరించారు. మార్గ మధ్యలో తన కుమార్తెకు హై బీపీ వచ్చిందని గేదెల రాజు తనకు ఫోన్ చేశాడని, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారని అన్నారు. తన కుమార్తె శవాన్ని తన ఇంటికి తీసుకవచ్చిన తరువాత కూడా తనకు ఎవ్వరిపైనా అనుమానం రాలేదని, అయితే, తమ కుటుంబ సభ్యులు మాత్రం తన కుమార్తె శరీరంలో వచ్చిన మార్పులను గమనించారని అన్నారు. ఇంత జరిగినా, తనకు రాజపై గానీ, రవిబాబుపై గానీ అనుమానం రాలేదని నూకరాజు చెప్పారు. తన కుమార్తె చనిపోయిన తరువాత రవికుమారు తనను పరామర్శించడానికి వచ్చాడని, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని హితవుపలికి పంపించేశానని ఆయన చెప్పారు.
గేదెల రాజు చనిపోయిన తరువాత కూడా గాజువాక వెళ్లి, ఆయన మృతదేహం కోసం వేచి ఉన్నానని, విశాఖ నగరంలో ఇటువంటి హత్యలు జరగడం పట్ల తను, టిడిపి నాయకులు బాధ పడ్డామని, అయితే, తన కుమార్తెను హతమార్చింది గేదెల రాజు అన్న విషయం నిన్ననే తెలుసుకున్నానని నూకరాజు వివరించారు. తన కుమార్తెను విషమిచ్చే చంపేశారని తను నమ్ముతున్నాను. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని తాను పోలీసులను కోరానని నూకరాజు వివరించారు. నూకరాజు ఫిర్యాదుతో పోలీసులు ఏవిధంగా ఈ కేసును ముందుకు తీసుకువెళతారో వేచి చూడాలి.