విశాఖపట్నం

నగరానికి అదనపు ఆకర్షణ బుద్ధ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: నగరంలోని కైలాసగిరి దివగు భాగాన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న హెల్త్ ఎరీనా సమీపంలో నిర్మిస్తున్న ‘బుద్ధ ప్రాజెక్టు’ విశాఖ పర్యాటక అందానికి తలమానికంగా నిలిచిపోతుందని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వుడా హెల్త్ ఎరీనాను శనివారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ బుద్ధ ప్రాజెక్టు పూర్తయితే కాలచక్ర తరహాలో బౌద్ధ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. వుడా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బుద్ధ ప్రాజెక్టు రూపకర్త సాంఘిక సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఆర్ మల్లిఖార్జున రావు సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో బౌద్ధం ఫరిడవిల్లిన ప్రాంతాలు, వాటి విశేషాలను అధికారి మల్లిఖార్జున రావు మంత్రి గంటాకు వివరించారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రూ.7.5 కోట్ల వ్యయంతో హెల్త్ ఎరీనా ప్రాజెక్టును చేపట్టామన్నారు. సైక్లింగ్, జాగింగ్ ట్రాక్‌ల నిర్మాణంతో పాటు ఏరోబిక్, మార్షల్ ఆర్ట్స్ గ్రౌండ్స్, వ్యాయామశాల నిర్మాణం పూర్తయిందన్నారు. వేలాది మంది నగర ప్రజానీకం వుడా హెల్త్ ఎరీనాను ఉపయోగించుకుంటున్నారని గంటా అన్నారు. దీనితో పాటు రూ.34 లక్షల వ్యయంతో బుద్ధ సైలెంట్ జోన్, యోగా, ధ్యాన, ఆరాధన జోన్‌ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. తొట్లకొండ, బావికొండ, శంకరం వంటి బౌద్ధ ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు కాలచక్ర ఉత్సవాల నిర్వహణ అంశమై బౌద్ధ ప్రముఖులు దలైలామాతో సంప్రదించనున్నట్టు తెలిపారు. పర్యటనలో ఆయన వెంట వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడు, అదనపు విసి రమేష్, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.