విశాఖ

అంతర్జాతీయ విపణిలో అరకులోయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 14: దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను అరకులోయలో నిర్వహిస్తున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ పేర్కొన్నారు. బెలూన్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అరకులోయ ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను చాటి చెప్పేందుకు వీలుగా బెలూన్ ఫెస్టివల్ ఏర్పాటు చేసామని చెప్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా అరకులోయ ఖ్యాతిని ఇనుమడింప చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన అరకులోయ విశిష్టత కోసం అనేక మంది పర్యాటకులకు తెలియదని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ ద్వారా పర్యాటకులందరికీ దీని ప్రాముఖ్యత తెలియచేప్పే విధంగా దీనిని నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ముఖ్య ఉద్ధేశ్యం దేశ, విదేశీ పర్యాటకులు మరింత మంది అరకులోయను సందర్శింపజేయడమేనని ఆయన అన్నారు. అరకులోయను అనునిత్యం పర్యాటకులు సందర్శించి విడిది చేసేలా పర్యాటక శాఖ ఇప్పటికే పలు వినూత్న కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందులో భాగమే బెలూన్ ఫెస్టివల్‌గా ఆయన చెప్పారు. విశాఖ ఏజెన్సీలో ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలపై ప్రసారమాద్యాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ స్థాయి బెలూన్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని రవిసుభాష్ కోరారు.