విశాఖ

వ్యవసాయం కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 14: ప్రతిష్టాత్మక అగ్రి హ్యాక్‌థాన్ 2017కు సర్వం సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సదస్సు జరుగుతున్న ఎపిఐఐసి ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు బుధవారం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయం, హార్టీకల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖలతో పాటు అనుంబంధ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే అగ్రిహ్యాక్‌థాన్ 2017గా పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తున్నారు. అయితే మన రైతాంగం పాటించే పద్ధతులు, అనుసరించే విధానాల స్థానే సరికొత్త సాంకేతికత, సాగు అంశాలను ఆవిష్కరించేందుకు ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు. వ్యవసాయంలో ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తారన్నారు. హ్యాక్‌థాన్ తొలి రోజు ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. మూడు అంశాలుగా సాగే సదస్సులో తొలి అంకం ఎగ్జిబిషన్. భారీ ప్రాంగణంలో 54 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి స్టాళ్ల ద్వారా రైతాంగానికి ఆధునిక వ్యవసాయం, సాగు అంశాలను వివరిస్తారన్నారు. ఇక రెండో అంశంగా ప్యాలల్ డిస్కషన్స్ సాగుతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి వస్తున్న ప్రముఖులు, శాస్తవ్రేత్తలు, మేథావులు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన అంశాలపై కీలక చర్చలు జరుగుతాయన్నారు. చివరగా పించ్ కాంపిటిటేషన్స్ ఉంటాయన్నారు. దీనికోసం 259 మందిని ఎంపిక చేశామన్నారు. వీరి డిస్కషన్స్ అనంతరం 10 మందిని ఎంపిక చేస్తారన్నారు. దీనికోసం ప్రత్యేక జ్యూరీ పనిచేస్తోందన్నారు. 10 మందిలో ముగ్గురు బెస్ట్ ప్రాక్టిషనర్స్‌ను ఎంపిక చేస్తారని తెలిపారు. వీరితో ప్రభుత్వం ఎంఓయులు కుదుర్చుకుంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు ఎంపికైన సంస్థలు పనిచేస్తాయన్నారు. దీనికి బిల్ మిలింద గేట్స్ ఫౌండేషన్ సంధాన కర్తగా వ్యవహరిస్తుందన్నారు. సమావేశానికి 500 మంది రైతులను ఆహ్వానించామని, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను హాజరయ్యే ప్రముఖుల ప్రసంగాలను వీరికి ప్రత్యేక పరికరాల ద్వారా అనువాదం చేసి వినిపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవీణ్‌కుమార్ జిల్లా అధికారులతో అగ్రిహ్యాక్‌థాన్ ఏర్పాట్లపై వివరించారు. అతిధుల రాక, బందోబస్తు తదితర అంశాలను చర్చించారు. సమావేశంలో డిసిపి ఫకీరప్ప, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జవహర్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 14: వన్‌టౌన్ రాజప్పనాయుడు వీధిలో శ్రీ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో లోకశాంతిని కాంక్షిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నేత్రపర్వంగా బుధవారం నిర్వహించారు. శ్రీ రామాంజనేయ భజన మండలి ప్రతినిధి భద్రమ్మ ఆధ్వర్యంలో కల్యాణం సాగింది. సమితి సభ్యులు శ్రీ విష్ణు సహస్ర నామాలు, గోవిందనామ సంకీర్తనల్ని సామూహిక పారాయణం చేశారు. అశేషంగా హాజరైన భక్తులకు తీర్ధ ప్రసాదాలు, అన్న వితరణ చేశారు. కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షుడు వై కృష్ణమూర్తి, అధ్యక్షుడు చావలి విశే్వశ్వర రావు, కార్యదర్శి జగన్మోహన రావు, ఎంవి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.