విశాఖ

తుస్సుమన్న బెలూన్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 16: పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ తుస్సుమంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన బెలూన్ ఫెస్టివల్ ఈ నెల 14వ తేదిన ప్రారంభమైన ఈ వేడుక ఆరంభ శూరత్వంగానే ముగిసింది. ప్రపంచంలోని 13 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు హాజరైన బెలూన్ ఫెస్టివల్ ఈ నెల 14 నుంచి 16వ తేది వరకు మూడు రోజుల పాటు జరగాల్సి ఉన్నప్పటికీ, కేవలం ఒకరోజుకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఈ నెల 14న ప్రారంభించిన బెలూన్ ఫెస్టివల్‌లో వివిధ దేశాలకు చెందిన రంగు రంగుల ఆకర్షణీయమైన బెలూన్లను మొదటి రోజు గాలిలోకి ఎగురవేసారు. బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన కొంతమందిని బెలూన్లతో పాటు ఎగిరే అవకాశం కల్పించారు. తొలిరోజు నిర్వహించిన ఈ ఫెస్టివల్‌ను తిలకించిన పర్యాటకులు, స్థానికులను అబ్బురపరిచింది. దీంతో మిగిలిన రెండు రోజులు కూడా గగన తలంపై ఎగిరే రంగుల బుడగలను కనులారా వీక్షించాలని తాపత్రయం పడిన పర్యాటకులు, స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండో రోజు బుధవారం రంగుల బుడగలను ఎగరవేసే అవకాశం దక్కలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వర్షం కురవడంతో బెలూన్ ఫెస్టివల్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే చివరి రోజు గురువారమైనా ఈ వేడుకను తిలకించాలనుకున్న వారి ఆశలపై వర్షం మళ్లీ నీళ్లు చల్లింది. దీంతో మూడో రోజు గురువారం కూడా బెలూన్లు గాలిలోకి ఎగరలేదు. చివరిరోజు నిర్వహించే ఈ వేడుకకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావలసి ఉన్నప్పటికీ వర్షం కారణంగా ఆయన పర్యటన కూడా రద్దయ్యింది. అయితే సుందరమైన ప్రకృతి అందాల నడుమ నిర్వహించతలపెట్టిన బెలూన్ ఫెస్టివల్‌ను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు అరకులోయకు పయనమై దీనిని చూసేందుకు ఆశక్తిగా ఎదురు చూసారు. బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం నాడు అంతంతమాత్రంగానే ఉన్న పర్యాటకులు, చివరి రెండు రోజులు మాత్రం అత్యధిక సంఖ్యలో అరకులోయకు చేరుకున్నారు. అరకులోయ ప్రకృతి అందాలతో పాటు మదురమైన బెలూన్ ఫెస్టివల్‌ను తిలకించవచ్చునని ఆశపడిన పర్యాటకులకు వాతావరణం చేదు అనుభవమే మిగిల్చింది. చివరి రెండు రోజులు బెలూన్ ఫెస్టివల్ నిర్వహణకు వాతావరణం అనుకూలించకపోవడంతో చేసేదేమి లేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పర్యాటకులే కాకుండా అరకులోయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బుధ, గురువారాలలో అత్యధిక సంఖ్యలో జనం అరకులోయకు చేరుకుని రంగుల బుడగలు ఎగిరే సన్నివేశాలను కనులారా వీక్షించాలని ఆశపడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఒక రోజుకే పరిమితమై అందరినీ నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఇదిలాఉండగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించతలపెట్టిన ఈ వేడుకకు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు కూడా అంతంతమాత్రమనే విమర్శలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన బెలూన్ ఫెస్టివల్‌పై సరైన ప్రచారం కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి. ఈ వేడుకను గురించి ప్రచారం చేయకపోవడమే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలను సైతం వెల్లడించకపోవడం, సరైన సౌకర్యాలను కల్పించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మాత్రం ఖరీదైన వసతులతో అట్టహాసంగా ఏర్పాట్లు చేసిన యంత్రాంగం మిగిలిన వారిని ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. అరకులోయలో నిర్వహించిన ఫెస్టివల్‌కు భద్రతా బలగాలను భారీగా మోహరించినప్పటికీ వారి బాగోగులను సైతం విస్మరించడంతో పోలీసు బలగాలు, ఇతర సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఏదిఎమైనా అట్టహాసంగా నిర్వహించాలని బావించిన బెలూన్ ఫెస్టివల్‌కు వర్షం అడ్డంకిగా మారి నీరుగార్చిందని చెప్పవచ్చు.