విశాఖపట్నం

సాగులో ఆధునికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: ప్రకృతి వైపరీత్యాలు, చీడ,పీడలతో దిగుబడి తగ్గి నష్టాలు సంభవించడం సాగు రంగంలో సర్వసాధారణం. పురాతన సంప్రదాయ వ్యవసాయ విధానాలతో కునారిల్లుతున్న రైతాంగాన్ని ఆధునికత వైపు నడిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎపి అగ్రిటెక్ సమ్మిట్ -2017 పేరిట మూడు రోజుల జాతీయ సదస్సుకు శ్రీకారం చుట్టింది. ఎపిఐఐసి గ్రౌండ్స్‌లో బుధవారం ప్రారంభమైన సమ్మిట్ రెండో రోజు గురువారం కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ లాభాలు పండించుకునేందుకు ఏం చేయాలన్న అంశాలను నిపుణులు, మేథావులు విడమర్చి చెపుతున్నారు. సాంకేతిక, యంత్ర పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేదానిపై ప్రసంగాలు చెపుతూనే, వాటి పనితీరును వివరిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, ఆసక్తిగల సందర్శకుల కోసం సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అవగాహన కల్పిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితీరును ప్రదర్శించే పరికరాలు, చీడ,పీడలను ఎదుర్కొని అధిక దిగుబడినిచ్చే వంగడాల ప్రదర్శన రైతులను ఆలోచింపచేస్తోంది. కొద్ది మంది కూలీలతో పెద్ద విస్తీర్ణంలో కమతాలను సాగుచేసే యంత్రాలను ఇక్కడ ఉంచి ప్రదర్శించారు. వీటి వల్ల కలిగే ఉపయోగాలు, వినియోగించే విధానాలను రైతులకు విడమర్చి చెప్పారు. వ్యవసాయ పనులకు కూలీలు కూడా దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో యాంత్రీకరణ ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చనే సందేశాన్నిచ్చారు.