విశాఖపట్నం

పౌష్టికాహారం..ఆనందమయ జీవితం ఏపీలోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: పౌష్టికాహారం, ఆనందమయమైన జీవితం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్థానిక ఏపిఐఐసి గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017లో రెండో రోజైన గురువారం జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐ.టి.ని ప్రమోట్ చేసినప్పుడు ఎవ్వరూ దాన్ని ఊహించలేదు. ఐ.టి. అభృవృద్ధి చెందడం వలన అనేక అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని వలన వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలియచేశారు. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని పరిరక్షించేందుకు మళ్లీ సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తున్నామని సిఎం చెప్పారు. దక్షిణ భారత దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఇందుకోసం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నామని అన్నారు.
కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ రైతులకు నీటిని సమకూర్చడం ద్వారానే వ్యవసాయంపై భరోసా పెంచగలమని, సమీకృత వ్యవసాయంతోనే రైతుకు లాభం చేకూరేలా కేంద్రం ప్రణాళికలను రచిస్తోందని ఇప్పుడిప్పుడిప్పుడే ఆ ఫలాలను అందుకుంటున్నామని ఆయన తెలియచేశారు. భారత దేశం అన్ని రకాల శీతోష్ణస్థితులు కలిగి ఉందని, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని రకాల పంటలను పండించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సూచించారు.
పించ్ కాంపిటేషన్‌లో పాల్గొన్న ఐదుగురు ప్రతినిధులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపిలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, కె.నారాయణ, సిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.