విశాఖపట్నం

నీ రాకకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసి, అరిచేతిలో ప్రపంచాన్ని చూడగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన వ్యక్తి బిల్‌గేట్స్. భారత దేశమంతా ఆయన రాకకోసం ఎదురు చూస్తుంటుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు నేరుగా విశాఖకే వస్తున్నారంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? బిల్‌గేట్స్ కోసం విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 300 మంది ప్రతినిధులు వేచి ఉన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, ఆయన క్యాబినెట్ మంత్రులంతా సిద్ధంగా ఉన్నారు. బిల్‌గేట్స్ ప్రసంగాన్ని వినేందుకు సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి బిల్‌గేట్స్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఏపిఐఐసి గ్రౌండ్స్‌కు వస్తారు ఇక్కడ రెండు గంటలు మాత్రమే గడపనున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని నగరంలో పోలీస్ బందోబస్త్‌ను పటిష్టం చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఓ బులెట్ ప్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేశారు. ఆయనతో వచ్చే వారికి కూడా తగిన వసతి సౌకర్యాలను సిద్ధంగా ఉంచారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం, తద్వారా భూసార పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలకు సంబంధించి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ఏపి ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. బిల్‌గేట్స్ ఈ ఫౌండేషన్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రైవేట్ సంస్థ ఇది ప్రపంచంలోని అత్యంత పేదలకు సహకారం అందించడం, వైద్య సహకారం అందించడం, అమెరికాలో విద్యావకాశాలను పెంపొందిచడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. కొంత కాలంగా బిల్ మిలిందా ఫౌండేషన్ వ్యవసా రంగంపై దృష్టిసారించింది. డ్రోన్‌ల సహకారంతో భూసార పరీక్షలు, ఎరువులు, పురుగుమందులను పిచికారీ చేయించడంలో ‘బిల్’ విజయం సాధించింది. ఈ డ్రోన్‌ల వినియోగం యు.ఎస్, ఆస్ట్రేలియా దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు చేయడాని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ ఫౌండేషన్‌కు బిల్‌గేట్స్ 2013లో 28 బిలియన్ యుఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. బిల్‌గేట్స్ ఒక్కసారి ఈ సదస్సుకు హాజరైతే, చాలా మంది వ్యాపారవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు.