విశాఖపట్నం

డేటా అనుసంధానంతో చిన్న తరహా రైతులకు ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: డేటా అనుసంధానం ద్వారా చిన్న రైతులకు ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు సూచించారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ సమ్మిట్‌లో భాగంగా రెండో రోజైన గురువారం మధ్యాహ్నం చిన్నతరహా రైతులకు డేటాతో అనుసంధానం అనే అంశంపై నిపుణులు, రైతులతో చర్చ జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ లీడ్ ఫర్ రూరల్ లైలీహుడ్ అండ్ అగ్రికల్చరల్ జాబ్స్ విభాగం ప్రతినిధి పరమేష్ షా నేతృత్వంలో చర్చ జరిగింది. ఈ చర్చలో డాల్‌బెర్గ్ డేటా ఇన్‌సెట్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్ ఫెడ్రిక్ పివెట్టా, క్రాపిన్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు కునాల్ ప్రసాద్, శ్యాట్‌స్యూర్ ఎనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ ప్రతీప్ బాసు, అగ్రిస్క్ డేటా ఎనలటిక్స్ సిఇఓ రవిశంకర్ మంథా పాల్గొన్నారు.
డేటాను చిన్న తరహా రైతులతో సహా మధ్య తరహా రైతులకు ఇతర అంశాలకు వివిధ రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటలైజేషన్ ద్వారా డేటాను వినియోగించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. సరైన డేటాతో వ్యవసాయానికి చక్కని ప్రణాళికలు రూపొందించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా రైతుల సాధికారిత సాధించే అవకాశం ఉందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, క్రిమి సంహారక మందులు వేటిపై వినియోగించాలి వంటి అనేక అంశాలపై డేటా ద్వారా వివరాలు లభిస్తుందని అన్నారు. డేటా ఉండడం వలన భూసారం రకం, దాని ఆరోగ్య పరిస్థితుల గురించి వివరంగా తెలుస్తుందని కునాల్ ప్రసాద్ తెలిపారు. ఒకే విధమైన పంటలు వేయడం వంటి అంశాలు తరచూ ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నాయని, ఇటువంటివి మిస్ మ్యాచ్ కాకుండా ఉండేందుకు డేటాను ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. డేటా వలన పంటల బీమా వివరాలు కూడా తెలుసుకోడానికి వీలుంటుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అనుభవాలను చంద్రబాబుకు వివరించారు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి, పూర్తిగా సేంద్రియ ఎరువులు వినియోగించడం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సాధిస్తున్నామని రైతులు వివరించారు. అలాగే, డ్రోన్‌ల వినియోగం వలన ప్రయోజనంతోపాటు, ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, అంతపరంలోని 125 ఎకరాల్లో వివిధ రకాలు పంటలను పూర్తిగా సేంద్రియ ఎరువులు వినియోగించి పండిస్తున్నామని చెప్పారు. సాగులో అనుభవం గడించిన రైతుల వివరాలను సేకరించి, వారి నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.