విశాఖపట్నం

సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: విశాఖ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. జోనల్ కమిషనర్లు, ఎఎంహెచ్‌ఓలు, యుసిడి అధికారులు, శానిటరీ ఇనస్పెక్టర్లతో శనివారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోజువారీ నిర్వహించే పారిశుద్ధ్య పనులతో పాటు మరింత శ్రద్ధ తీసుకుంటే చెత్త రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రణాళిక బద్ధంగా పారిశుద్ధ్య పనులను నిర్వహించడం ద్వారా స్వచ్ఛ భారత్ రేటింగ్‌లో విశాఖ తప్పనిసరిగా అత్యుత్తమ స్థానంలో నిలుస్తుందన్నారు. నగరంలోని 35వేల వాణిజ్య భవనాలు, ముఖ్య కూడళ్లలో నిరంతర పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో చెత్త సేకరణకు సంబంధించి మోబైల్ వాహనాలను వినియోగించనున్నట్టు తెలిపారు. మోబైల్ వాహనాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంను ఏర్పాటు చేసి చెత్త సేకరణపై అవగాహన కల్పించాలన్నారు. రద్దీ సమయాల్లో వాణిజ్య కూడళ్లలో చెత్తను తరలించేందుకు కొంతమంది ముందుకు రారని, దీనివల్ల రోడ్లపైనే చెత్త వేస్తున్నారని, ఈ పద్ధతిని నివారించేందుకు రెండు సార్లు ఆయా ప్రాంతాల్లో చెత్త సేకరణ వాహనాలను నడపాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి అదనపు వాహనాలతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు తోపుడుబళ్లు, గ్లౌజ్‌లు, దుస్తులు, స్వీపింగ్ సామాగ్రిని సమకూర్చనున్నట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ రేటింగ్ నిమిత్తం కేంద్ర కమిటీ జనవరి 1 నుంచి 15 వరకూ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సర్వే నిర్వహించనుందని, ఆయా తేదీల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగుతాయన్నారు. జివిఎంసి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వ్యక్తులు, వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలత జరిమానా విధిస్తామని, అయినప్పటికీ మార్పు రాకుంటే వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ అంశంపై ప్రజలను చైతన్య వంతులను చేయడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు జివివిఎస్ మూర్తి, మోహనరావు, యుసిడి ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్, జోనల్ కమిషనర్లు, ఎపిడిలు, ఎఎంహెచ్‌ఓలు, శానిటరీ ఇనస్పెక్టర్లు పాల్గొన్నారు.

పచ్చదనానికి ప్రాధాన్యత
* ఎయులో స్వచ్ఛ భారత్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 26: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వచ్ఛ భారత్‌లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కేవలం పరిసరాలను బాగుచేసుకోవడమేగాకుండా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జనాభా పెరిగి పచ్చదనం కనుమరుగవుతున్న తరుణంలో విరివిగా మొక్కల పెంపకం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలు నాటే విధంగా కృషి చేయాలన్నారు. అలాంటపుడే ఉష్ణోగ్రతలు పెరిగినా జనాభాకు సరిపడా ఆక్సిజన్ అందించే వీలుంటుందన్నారు. ఒకప్పుడు విశాఖ నగరం అంతా పచ్చదనంతో కళకళలాడేదని, నేడు ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చాక పచ్చదనం కనుమరుగైందన్నారు. అందువల్ల ఖాళీ స్థలాలు ఉన్న చోట తప్పనిసరిగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో మొక్కల పెంపకం మరీ అవసరమన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎన్‌ఎడి పాల్ తదితరులు పాల్గొన్నారు.