విశాఖ

ఘనంగా గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, డిసెంబర్ 11: ఈనెల 16న అత్యంత వైభవంగా జరగనున్న కుంచావారి గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపులో భాగంగా సోమవారం వివిధ రకాల పిండివంటలలు వండి మహిళలు సారె ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో భాగంగా పట్టణంలోని పలువీధుల మీదుగా ఈ ఊరేగింపు సాగింది. పిండివంటలను గౌరీపరమేశ్వరులకు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం జరగనున్న గౌరీపరమేశ్వరుల మహోత్సవానికి స్థానిక మెయిన్‌రోడ్డులో భారీ విద్యుత్ లైటింగ్‌తోపాటు భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వివిధ సాంస్క్రతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సాంబశివరావు, పాండ్రంకి సత్యారావు, కుంచం చిట్టిబాబు, కామధేనువుప్రసాద్, కర్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
* చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 11: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోను వౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు అన్నారు. మండలంలోని విజయరామరాజుపేట బొడ్డేటి కట్టువద్ద కల్లాలకు వెళ్లే రహదారుల్లో కల్వర్టుల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్ధాపన చేశారు. అలాగే విజయరామరాజుపేట శ్మశానం వద్ద కల్వర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అనంతర వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి కొండపై నిర్మాణం తలపెట్టిన రోడ్డు నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. స్వామి వారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్దికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. నియోజవర్గాన్ని అన్ని విదాలా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండలాధ్యక్షురాలు చోడే కొండమ్మ, మాజీ ఎంపిపి బత్తుల తాతయ్యబాబు, వైఎస్ ఎంపిపి దాడి సూరినాగేశ్వరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, దేశం నాయకులు వియ్యపు అప్పారావు, విజయరామరాజుపేట సర్పంచ్ దొడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.