విశాఖ

ఇట్టే స్పందించారు.. అట్టే ఆదుకున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 11: స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన మూడు స్కూల్ బస్సులు పిక్నిక్‌కు వెళ్లి యారాడ కొండవద్ద ఢీకొన్న విషయం విధితమే. ఈ సంఘటనలో దాదాపుగా పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా చాలామంది విద్యార్థులు పలు గాయాలు, దెబ్బలతో విలవిల్లాడిపోయారు. ఈ సంఘటన జరిగినదే తడవుగా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్ స్పందించిన తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిందే తడవుగా సంబంధిత గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్‌కు తెలియజేసి సంబంధిత ఎమ్మెల్యేతోపాటుగా అగనంపూడి ఆసుపత్రికి చేరుకుని అక్కడ విద్యార్థులకు అందుతున్న వైద్యసేవలపై స్పందించారు. కెజిహెచ్‌లోను, విశాఖ కేర్ ఆసుపత్రిలోను, అయ్యన్నాస్ కళింగ ఆసుపత్రిలోను ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్సించి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరాతీసారు. ఆదివారం రాత్రంతా కెజిహెచ్‌లోనే ఉండి ఎప్పటికప్పుడే విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై తగు చర్యలు తీసుకున్నారు. మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్ తదితరులంతా సంఘటనా స్థలానికి చేరుకుని తగు వైద్య సదుపాయాలపై ఆదేశాలను జారీచేయించడంలో ఎమ్మెల్యే కీలకపాత్ర వహించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన విద్యార్థులకు సైతం తదుపరి అందుతున్న వైద్యసేవలపై ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా ఫోన్‌చేసి డిశ్చార్జి అయిన విద్యార్థులంతా అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి సోమవారం చేరుకునేలా ఏర్పాట్లు చేసారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్‌మోహన్ ఈసంఘటనలో గాయపడిన విద్యార్థులకు సిటీ స్కాన్, ఎక్స్‌రే తదితర అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. ఆ విధంగా 25మంది విద్యార్థులకు ఈ విధమైన వైద్య చికిత్సలు పొందారు. ఈ సంఘటనతో భయబ్రాంతులైన విద్యార్థులకు మానసిక వైద్యనిపుణలతో కౌన్సిలింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేసారు. దీంతోపాటు చికిత్స పొందేందుకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈసంఘటనలో గాయపడిన విద్యార్థుల కోసం ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. జగన్‌మోహన్ ఎముకల వైద్యులు డాక్టర్ సింహాచలం తదితరులతో ఎమ్మెల్యే ఎప్పటికప్పుడే సంఘటనలో గాయపడిన విద్యార్థులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీస్తున్నారు. బస్సు ప్రమాద సంఘటనలో గాయపడిన విద్యార్థులకు అందుతున్న వైద్యసేవలపై సత్వరమే ఎమ్మెల్యే పీలా గోవింద్ స్పందనపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూల్స్ యాజమాన్యాల నుండి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు.