విశాఖపట్నం

28 నుంచి విశాఖ ఉత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: ఏపీ ప్రభుత్వం, యునెస్కో సంయుక్తంగా విశాఖలో టెక్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబఱ్‌లో విశాఖలో నిర్వహించనున్న ఈవెంట్లపై మంత్రి సోమవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర అధికారులతో సమీక్షించిన అనంతరం ప్రభుత్వ అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 16, 17, 18తేదీల్లో నొవెటల్ హోటల్‌లో నిర్వహించే టెక్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారన్నారు. మలేషియా, నేపాల్, యుఏఇ దేశాలకు చెందిన విద్యాశాఖామంత్రులు 200మంది విదేశీ ప్రతినిధులు, 800 మంది వరకు స్థానిక ప్రతినిధులు, ముగింపు రోజున కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరుకానున్నట్టు వివరించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ టెక్ కాన్ఫరెన్స్ విద్యార్థులకు ఉపకరించేలా ఉంటుందన్నారు. ఈ సదస్సులో అన్ని యూనివర్శిటీల వీసిలు హాజరవుతారన్నారు. విశాఖలో పర్యాటకాభివృద్ధి కోసం పర్యాటకశాఖ, విశాఖపోర్టుట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు పాసింజర్ షిప్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇస్తాంబుల్ నుండి రెండు యూటింగ్ బోట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా పండుగగా విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ పండుగలో నగరంలో ఉత్తమ అలంకరణలు నిర్వహించిన సంస్థలకు హోటళ్ళకు లక్కీడిప్ ద్వారా ప్రత్యేక బహుమతులను అందజేయించడం జరుగుతుందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఈ నెల 23న జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుందని, అన్ని శాఖలు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పర్యాటక అధికారి పూర్ణిమాదేవి హాజరయ్యారు.