విశాఖ

పోలీసుల హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, డిసెంబర్ 11: జి.మాడుగుల మండలం బందవీధి గ్రామంలోని బి.ఎస్.ఎన్.ఎల్. సెల్ టవర్‌ను ఆదివారం రాత్రి మావోయిస్టులు దగ్ధం చేసారు. కొంతమంది సభ్యుల గల మావోల బృందం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సెల్ టవర్ వద్దకు చేరుకుని తమతో తీసుకువచ్చిన పెట్రోలును సెల్ టవర్‌లోని పవర్ బాక్స్‌పై వేసి నిప్పుపెట్టారు. దీంతో పవర్ బాక్సు పూర్తిగా కాలి పోవడంతో బందవీధి సెల్ టవర్ ద్వారా సెల్ సంకేతాలు నిలిచిపోయాయి. గిరిజన ప్రాంతంలో సెల్ టవర్ల వలన తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని భావించిన మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గూడెంకొత్తవీధి మండలం దారకొండ సెల్ టవర్‌ను ఇటీవల పేల్చివేసిన మావోయిస్టులు తాజాగా బందవీధి సెల్ టవర్‌ను కాల్చివేసి ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు సెల్ సంకేతాలకు విఘాతం కల్పించారు. పాడేరు నుంచి చింతపల్లి మార్గంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే ఈ సెల్ టవర్‌ను రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోనే మావోయిస్టులు దగ్ధం చేయడం పట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అనేక వాహనాలతో రద్దీగా ఉండే రహదారి ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ను మావోలు సునాయసంగా దగ్ధం చేయడం పోలీసుల వైఫల్యంగా చెబుతున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు హైడ్రామా నడిపించి సెల్ టవర్ దగ్ధంలో మావోల ప్రమేయం లేదని, షార్టు సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రచారం సాగించారు. పోలీసులు ఆడిన హైడ్రామాకు బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులు కూడా వత్తాసు పలికి షార్టు సర్క్యూట్ వలన టవర్ దగ్ధమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులే స్వయంగా ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో సెల్ టవర్ దగ్ధంపై సోమవారం సాయంత్రం వరకు రకరకాల ఊహగానాలు ప్రచారం జరిగాయి. అయితే సంఘటన స్థలంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ విలేఖరుల చేతికి చిక్కడంతో మావోలే సెల్ టవర్ దగ్ధానికి పాల్పడినట్టు నిర్థారణయ్యింది. కాగా మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడితే పోలీసులు ఎందుకు కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసారు? పోలీసుల ప్రయత్నాలకు బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులు ఎందుకు వత్తాసు పలికారు?? అనే ప్రశ్నలు ప్రస్తుతం అందరి నోట చర్చనీయాంశంగా మారింది. గిరిజన ప్రాంతంలో ఇటీవల మావోలు వరుస సంఘటనలకు పాల్పడుతుండడమే కాకుండా బొయితిలి గ్రామంలో రెండు రోజుల క్రితమే ఇద్దరు ఇన్‌ఫార్మర్లను మావోలు హతమార్చిన సంఘటన తెలిసిందే. దీంతో మావోల ఉనికి పోలీసులకు ఇబ్బందికరంగా పరిణమించి సెల్ టవర్ దగ్ధం సంఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల సూచనల మేరకే బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులు వారు చెప్పిన రీతిలో షార్టు సర్క్యూట్ కారణంగా సెల్ టవర్ దగ్ధమైనట్టు పిర్యాదు చేసారని చెబుతున్నారు.