విశాఖపట్నం

నిరాశ పరచిన వనే్డ టికెట్ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 12: భారత్, శ్రీలంక జట్ల మధ్య నగరంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి వీడీసీఏ, ఏసీఏ గ్రౌండ్స్‌లో జరగనున్న మూడో వనే్డ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వనే్డ మ్యాచ్ టికెట్లను కొద్ది రోజుల కిందటే ఆన్‌లైన్‌లో విక్రయించిన నిర్వాహకులు కొన్ని టికెట్లను మాత్రం బహిరం మార్కెట్‌లో కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా నగరంలోని 17 కేంద్రాల్లో వనే్డ టికెట్ల విక్రయాన్ని మంగళవారం ప్రారంభించారు. రూ.500, రూ.1200, రూ.1800, రూ.2500, రూ.3000, రూ.6000 టికెట్లు విక్రయిస్తున్నట్టు నిర్వాహకులు తొలుత ప్రకటించారు. అయితే మంగళవారం నాడు ప్రకటించిన అన్ని కేంద్రాల్లోనూ రూ.500 టికెట్లు లభ్యం కాలేదు. కేవలం పెద్ద డినామినేషన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొద్ది మంది మాత్రం రూ.1200, రూ.1800 టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ ఆపై డినామినేషన్ల టికెట్లు మాత్రం అమ్ముడుపోలేదు. గతంలో వనే్డ క్రికెట్ మ్యాచ్ టికెట్లు విక్రయ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో యువకులు, బారులు తీరేవారు. పోలీసు బందోబస్తు మధ్య టికెట్లు విక్రయించేవారు. ఇప్పటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కన్పించాయి. టికెట్ విక్రయ కేంద్రాల వద్ద అతికొద్ది మంది మాత్రమే క్యూలైన్లలో కన్పించారు. సామాన్యులకు క్రికెట్ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించే అవకాశాన్ని దూరం చేశారంటూ నిర్వాహకులను విమర్శించిన సందర్భాలు కన్పించాయి.

బాధితులు కోరిన న్యాయవాదులనే నియమించాలి
* మహిళా చేతన కార్యదర్శి పద్మ డిమాండ్
విశాఖపట్నం, డిసెంబర్ 12: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధిక చట్టం ప్రకారం వాకపల్లి బాధిత మహిళలు కోరుకున్న న్యాయవాదిని నియమించి కేసును విచారణ చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విచారణ నిమిత్తం వాకపల్లి బాధిత మహిళలు మంగళవారం జల్లి కోర్టు ప్రాంగణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితోపాటు వచ్చిన పద్మ మీడియాతో మాట్లాడుతూ బాధితులు కోరుకుంటున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను నియమించి కేసు విచారణ చేపట్టాలన్నారు. రాజమండ్రికి చెందిన పల్లా త్రినాధ్‌రావును పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గాను, విశాఖకు చెందిన జహీరాను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గాను నియమించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధిక చట్టం అనుసరించి బాధిత మహిళలకు కోరుకున్న వారిని న్యాయవాదులుగా నియమించుకునే హక్కు ఉందన్నారు. ఈ విషయంపై అక్టోబర్ 30వ తేదీన జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసామన్నారు. అయితే విచారణ మొదలైనప్పటికీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్నారు. దీంతో మంగళవారం చేపట్టిన విచారణలో డిఫర్ చేయమని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయమూర్తిని కోరినట్టు చెప్పారు. అలాగే ఇదే విషయంపై హైకోర్టులో పిటీషన్ కూడా వేసినట్టు ఆమె పేర్కొన్నారు. పిటీషన్ నెంబర్ కూడా జారీ అయిందన్నారు. త్వరలోనే హియరింగ్‌కి వస్తుందని, చుండూరు, కారంచేడు కేసుల్లో బాధితులు కోరుకున్న న్యాయవాదులను నియమించినట్టుగానే వాకపల్లి కేసులో కూడా బాధిత మహిళలు కోరుకున్న పీపీ, ఏపీపీలనే నియమించాలన్నారు. మహిళలపై అత్యాచారం జరిగిన పదేళ్ళు దాటిందని, గ్రేహౌండ్స్ పోలీసులు ఈ కేసు విచారణ జరగకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అడ్డుకున్నారన్నారు. నాలుగు మాసాల కిందట సుప్రీంకోర్టు పోలీసులు వేసిన పిటీషన్ కొట్టివేస్తూ కేసు విచారణలో జరిగిన జాప్యాన్ని తప్పుపట్టిందన్నారు. కేసును తక్షణమే ట్రయిల్‌కోర్టు వేసి ఆరు మాసాల్లో విచారణ పూర్తి చేయాలన్నారు. ఈ నేపధ్యంలో బాధిత మహిళలు కోరుకున్న విధంగా పీపీ, ఏపీపీలను నియమించాలన్నారు. కాగా మొత్తం తొమ్మిదిమంది బాధిత మహిళలకుగాను మంగళవాంర విచారణకు ఇద్దరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ప్రతినిధులు విఎస్ కృష్ణ, సుధ తదితరులు పాల్గొన్నారు.