విశాఖపట్నం

శిశు గృహం నుంచి స్పెయిన్ మహిళ ఒడిలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్న తల్లే వద్దనుకుని వదిలి వెళ్లిపోయింది. పేగు బంధం లేకపోయినా, రుణానుబంధం ఉందేమో ఆ బిడ్డను పరాయి దేశానికి చెందిన ఓ మహిళ తన ఒడిలోకి చేర్చుకుంది. ఈ అద్భుత ఘటన విశాఖలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో ఎంవీపీ కాలనీలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఓ మహిళ ఆడ బిడ్డను ప్రసవించింది. ఏ కారణం చేతనో ఆ బిడ్డను నర్సింగ్‌హోంలోనే వదిలి వెళ్లిపోయింది. వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ బిడ్డను తీసుకున్నారు. 1200 గ్రాముల బరువుతో పుట్టిన ఈ బిడ్డకు అదే ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగున్న తరువాత ఆ బిడ్డను శిశు గృహానికి తీసుకువెళ్లి, ఆలనా పాలనా చూస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల తరువాత ఈ బిడ్డకు సరయు అని నామకరణం చేశారు. ఇప్పుడు సరయుకు రెండేళ్ల వయసు వచ్చింది. సరయు వివరాలను స్ర్తి శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. వెబ్‌సైట్ ద్వారా సరయు వివరాలు తెలుసుకున్న స్పెయిన్‌కు చెందిన వెన్నీసాక్రిస్టినా సాతూర్ అనే సుమారు 40 సంవత్సరాల మహిళ ఈ బిడ్డను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. సుమారు ఏడాది కాలంగా ఈ దత్తత ప్రక్రియ కొనసాగుతోంది. ఒక బిడ్డను ఇతర దేశస్తులకు దత్తత ఇవ్వాలన్నా, వారు తీసుకోవాలన్నా అనేక నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ పాటించి సరయును సాతూర్‌కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు.
సాతూర్ గురించి..
సాతూర్‌ది హైదరాబాద్. ఆమె తండ్రి హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేసేవారు. సాతూర్ జన్మించిన కొంత కాలానికి ఈ కుటుంబం అంతా హైదరాబాద్ నుంచి స్పెయిన్‌కు వెళ్లిపోయింది. సాతూర్ స్పెయిన్‌లోనే పెరిగి పెద్దదై, ఆ దేశ పర్యాటక శాఖలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లంటే ఆమెకు ఇష్టం లేదు. ఆమె నివశిస్తున్న ప్రాంతంలో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. భారత దేశం అన్నా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ అంటే సాతూర్‌కు ఎంతో ఇష్టం. రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోని శిశు గృహం నుంచి సాతూర్ ఓ బాలికను దత్తత తీసుకుంది. ఆమెకు సాయి అని నామకరణం చేసింది. స్పెయిన్ తీసుకువెళ్లి సకల సదుపాయాల మధ్య సాయిని అల్లారు ముద్దుగా పెంచుతోంది. ఆడ పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్న సాతూర్ 2016లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ వెబ్‌సైట్‌లో విశాఖ శిశు గృహంలో ఉన్న సరయు గురించి తెలుసుకుంది. ఆ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని స్పెయిన్ ఆథరైజ్డ్ ఫారన్ అడాప్షన్ ఏజెన్సీకి తెలియచేసింది. ఈ సంస్థ మన దేశ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సరయును దత్తత తీసుకునేందుకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సంవత్సరంపాటు ఇరు దేశాల అధికారులు కసరత్తు జరిపారు.
ఎన్ని జాగ్రత్తలో..
విదేశస్తులకు బిడ్డను దత్తత ఇచ్చేటప్పుడు అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
* ఈ బిడ్డను దత్తత తీసుకునేందుకు మన ప్రభుత్వానికి సాతూర్ 5000 డారల్లను చెల్లించాల్సి ఉంటుంది. సాతూర్ ఆ మొత్తాన్ని కూడా చెల్లించింది. ఇలా వచ్చిన మొత్తాన్ని మన శిశు గృహాల నిర్వహణకు వినియోగిస్తారు.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం మన దేశంలోని ఆడపిల్లలకు సంప్రదించిన హక్కులన్నీ స్పెయిన్‌కు దత్తత వెళుతున్న ఈ బిడ్డకు కూడా చెందాల్సి ఉంటుంది.
* ఇప్పటికే సాతూర్ ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంది. మరో బిడ్డను కూడా దత్తత తీసుకోవడంపై ఆ మొదటి బిడ్డ ఇష్టాయిస్టాలను కూడా అధికారులు తెలుసుకోవాలి. ఈనేపథ్యంలో ఇక్కడి అధికారులు సాయి అనుమతి కూడా తీసుకున్నారు.
* ఈ బిడ్డను ఫలానా వారికి దత్తత ఇస్తున్నట్టు ఫ్యామిలీ కోర్టులో ముందుగా తెలియచేసి, కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే, దత్తత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా వీరు పూర్తి చేశారు.
* దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులతో అమ్మాయి కలిసి మెలిసి ఉంటోందా? లేక ఏమైనా ఇబ్బంది పడుతోందా? అని మూడు నెలలకు ఒకసారి స్పెయిన్‌లోని భారత అంబాసిడర్ కార్యాలయం నుంచి నివేదిక రప్పించుకోవలసి ఉంటుంది.
* విదేశాలకు దత్తత వెళ్లే పిల్లలకు కేవలం ఒక్క రోజులోనే పాస్‌పోర్ట్ ఇప్పించాలి. రెండు, మూడు గంటల్లోనే వీసా కూడా రప్పించే బాధ్యత మన ప్రభుత్వ చూసుకుంటుంది. సరయుకు మంగళవారం పాస్‌పోర్ట్ వచ్చేసింది. బుధవారం వీసా కూడా రానుంది.
ఈ తంతు అంతా పూర్తయిన తరువాత సరయును కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాతూర్‌కు అప్పగించారు.

వైఫల్యాలను అధిగమించి ముందుకు సాగాలి
* స్వామీ గణేశానంద

విశాఖపట్నం, డిసెంబర్ 12: జీవితంలో వైఫల్యాలు సహజమని, ఓటమి ఎదురైనప్పటికీ లక్ష్య సాధనపై మరింతగా దృష్టి పెట్టి ముందుకు సాగాలని రామకృష్ణ మిషన్ ప్రతినిధి స్వామీ గణేశానంద యువతకు పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిత్యం చైతన్య వంతంగా ఉండే వారికి విజయ సాధన తేలికైన విషయమన్నారు. విద్యాభ్యాసం అంటే కేవలం విషయ పరిజ్ఞానం పొందడం ఒక్కటే కాదని, పరిశీలన, విశే్లషణ, ఆలోచనల సమాహారం ఉండాలన్నారు. మంచి,చెడులను విశే్లషించుకుని స్వయం నియంత్రణతో యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని, అది గాంధీజీ, సిస్టర్ నివేదిత, స్వామీ వివేకానంద తరహాలో ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలన్నారు. వ్యక్తులు గొప్ప పనులు, అనే్వషణలే వారిని ఉన్నతంగా నిలుపుతాయని స్వామి గణేశానంద పేర్కొన్నారు. కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ రోజిట్లా జోసెఫ్ అధ్యక్షత వహించారు.