విశాఖపట్నం

16న నగరంలో సీఎం విస్తృత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 16న నగరంలో విస్తృతంగా పర్యిటించనున్నారు. శనివారం ఉదయం ఆయన నగరానికి చేరుకుంటారు. యునెస్కో డిజిల్ క్లాస్‌లకు సంబంధించి విశాఖలో అంతర్జాతీయ సదస్సు 16న నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. వెయ్యి మంది వరకూ మొత్తం ప్రతినిధులు హాజరవుతారని అధికారులు తెలియచేశారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తరువాత ప్రభుత్వరంగ పరిశ్రమల యాజమాన్యాలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ రంగ సంస్థలకు సీఎం అవార్డులు ఇవ్వనున్నారు. ఆ తరువాత కరూర్ వైశ్యా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే హెలీ టూరిజంలో భాగంగా స్థానిక వుడా పార్క్ నుంచి హెలికాప్టర్‌ను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు.