విశాఖ

‘హెలికాప్టర్’ ఎగిరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖకు హెలీటూరిజం వచ్చినట్టే వచ్చి దూరమైపోతోంది. కొద్ది రోజుల కిందట హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా వేసింది. కానీ విశాఖలో ఈ హెలికాప్టర్ నిరంతరం తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. హెలీ టూరిజంలో భాగంగా వుడా పార్క్‌లోని సముద్ర తీరాన్ని ఆనుకుని హెలీప్యాడ్ కూడా నిర్మించారు. పవన్ హాక్స్ సంస్థకు చెందిన హెలికాప్టర్ రెండు రోజులపాటు నగరంలో చక్కర్లు కొట్టింది. ఇంకేముంది హెలీ టూరిజం కల సాకారమైందని అంతా అనుకున్నారు. అయితే, నేవీ అధికారులు కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. నేవీ అనుమతుల ఆధారంగా హెలీ టూరిజంను కొనసాగించాలని వుడా అధికారులు భావించారు. అయితే, ఈ హెలికాప్టర్‌కు సీఎం జెండా ఊపకుండా ఎలా? అన్న మీమాంశ రావడంతో కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేశారు. తాజాగా 16వ తేదీన హెలీ టూరిజంను సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈనెల 14తో నేవీ ఇచ్చిన అనుమతులు రద్దవనున్నాయి. దీంతో వుడా అధికారులు మళ్లీ కొత్త అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.