విశాఖ

రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈస్ట్‌కోస్‌ట రైల్వే ప్రత్యేక రైల్లను నడుపుతోంది. కాచిగూడ-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్ కాచిగూడలో వచ్చే నెల రెండో తేదీ సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, ఉదయం 7.05 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 30 వరకూ నడుస్తుంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నంలో వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం 7.05 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 31 వరకూ నడుస్తుంది.