విశాఖపట్నం

ఉరుకులు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ఎంసెట్ 2016 ప్రశాంత వాతావరణంలో శుక్రవారం జరిగింది. ఎంసెట్‌కు విశాఖ నగరంలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్‌కు 18,075 మంది దరఖాస్తు చేసుకోగా, 17,297 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ పరీక్షకు 7,519 మంది దరఖాస్తు చేసుకోగా, 7,127 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌కు 33 పరీక్షా కేంద్రాలను, మెడిసిన్‌కు 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘నీట్’ పరీక్ష తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురైనప్పటికీ, ఎంసెట్ యధాతథంగా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఎంసెట్ నిర్వహణ ప్రశాంత వాతావరంలో పూర్తయింది. పరీక్షకు ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చెదురు మదురు సంఘటనలు మినహా ఎక్కడా ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్ష రాయకుండా వెనుదిరిగిన సంఘటనలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులు ఉరుకులు పరుగులుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద నిరీక్షించడం కన్పించింది. ఒక పక్క ఎండ మండిస్తున్నా, ఉక్కపోత ఉస్సురని పిస్తున్నా పిల్లలు పరీక్షలు ఎలా రాస్తున్నారన్న ఆత్రుత తల్లిదండ్రుల్లో కన్పించింది. చెట్ల నీడన సేదతీరుతూ పిల్లల కోసం ఎదురు చూశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత రవాణా సదుపాయం కల్పించడం పట్ల తల్లిదండ్రుల్లో హర్షాతిరేకత వ్యక్తమైంది. హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించారు. మొత్తానికి ఎంసెట్ 2016 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. సంయుక్త కలెక్టర్ 2 డివి రెడ్డి నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.