విశాఖపట్నం

నగరంలో కాలుష్యాన్ని తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ప్రస్తుతం నగరంలో నెలకొన్న 80 మైక్రోగ్రామ్స్ కాలుష్య స్థాయిని దేశ వార్షిక సరాసరి అయిన 60 మైక్రోగ్రామ్స్ స్థాయికి తగ్గించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కాలుష్య నివారణ మండలి అధికారులను ఆదేశించారు. క్రమేపీ ఈ కాలుష్య స్థాయిని తగ్గించుకుంటూ భవిష్యత్‌లో విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం మాధవధార వుడా కాలనీలో కాలుష్య నివారణ మండలి జోనల్ కార్యాలయాన్ని మంత్రి సందర్శించి భవనంపై ఏర్పాటు చేసిన 25 కిలో వాట్స్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.24 లక్షలు వెచ్చించి ఈ సోలార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు ఈ ప్లాంట్ 100 యూనిట్ల విద్యత్‌ను ఉత్పత్తి చేస్తుందని జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి.మధుసూదనరావు మంత్రికి వివరించారు. ప్రభుత్వ రాయితీ రూ.12 లక్షలు మంజూరైందని, మిగిలిన సొమ్ము శాఖాపరంగా పెట్టుబడి పెట్టామన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్ల విధానాన్ని అమలు పరిచి సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో సౌర విద్యుత్‌ను వాడుకునే విధానాన్ని ప్రోత్సహించాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో ఆయన సమావేశమై నగరంలో నెలకొని ఉన్న కాలుష్య సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ నగరంలో కాలుష్య సమస్యను సమూలంగా పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలన్నారు. నగర పరిధిలోని కాలుష్య కారకాలైన పరిశ్రమల విస్తరణను అనుమతించొద్దని, అవసరమైతే వేరొక చోట వాటి విస్తరణకు అనుమతించాలన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.రవీంద్రనాథ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.