విశాఖపట్నం

క్యాష్ పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 13: పండుగ వేళ ప్రజలకు క్యాష్ పరేషాన్ తప్పలేదు. తెలుగు ప్రజలు అట్టహాసంగా చేసుకునే సంక్రాంతి సందడికి నగదు కొరత అడ్డుకట్టవేసేలా ఉంది. నోట్ల రద్దు అనంతరం కొద్ది నెలల పాటు నగదు కొరతతో ఇబ్బందులు పడిన ప్రజానీకం ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. గత నాలుగు రోజులుగా నగరంలో ఎక్కడ చూసినా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడం. మంగళవారం కూడా తెరచుకుంటాయో లేదో అర్ధం కాని పరిస్థితుల్లో చిరు అవసరాలు తీర్చుకునేందుకు ఏటీఎంలే దిక్కు. అయితే గత మూడు రోజులుగా నగరంలో ఏటీఎంలు నగదు కొరత ఎదుర్కొంటున్నాయి. నగరంలో జాతీయ, ప్రైవేటు సంస్థలతో పాటు సహకార రంగంలో 40కిపైగా బ్యాంకులు, 750 శాఖలతో పనిచేస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో నగరంలో 650 ఏటీఎంలు, గ్రామీణ ప్రాంతాల్లో 510 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. నోట్లరద్దు అనంతరం వీటిని కొత్తనోట్లకు అనువుగా తీర్చిదిద్దడంతో పాటు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రోజుల తరబడి నిలిపివేశారు. మెల్లమెల్లగా ఏటీఎంలు అందుబాటులోకి వచ్చి పరిస్థితి చక్కబడింది. అయితే హఠాత్తుగా నాలుగు రోజుల నుంచి ఏటీఎంలలో నగదు కొరత తెరపైకి వచ్చింది. ఏటీఎంల ద్వారా రోజుకు రూ.1.8 కోట్ల మేర నగదు చెలామణి అవుతుందని అంచనా. అయితే ఒక్కసారిగా బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొనడంతో ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయమేర్పడింది. దీంతో ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్ని జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎంలతో పాటు ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు మాత్రం అరకొర నగదుతో సేవలందిస్తున్నాయి. శనివారం నుంచి ఇవి కూడా మూతపడ్డాయి.
ఏటీఎంలో నగదు కొరతకు సంబంధించి బ్యాంకు అధికార వర్గాలు ఎప్పటి మాదిరి స్పందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బ్యాంకుల్లో నగదు జమలు తగ్గి, విత్‌డ్రాలు పెరిగినట్టు అధికార వర్గాల సమాచారం. బ్యాంకుల్లో నగదుపై ఇటీవల చోటుచేసుకున్న ప్రచారం కూడా కారణమని ఈ వర్గాల అభిప్రాయం. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగానే ఏటీఎంల్లో కూడా నగదు అందుబాటులో ఉంచలేకపోతున్నట్టు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పండుగ సందర్భంగా ఖర్చుల నిమిత్తం ఖాతాదారులు ముందుగానే తమ ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకున్నారని, దీని వల్ల ఏటీఎంలలో నగదు ఉంచలేని పరిస్థితి ఎదురైందని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి.

బ్యాంకు అధికారులకు ఎంపీ హరిబాబు ఫోన్
సంక్రాంతి సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు రావడం, ఇదే సందర్భంలో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడటంపై విశాఖ ఎంపీ కె హరిబాబు స్పందించారు. శనివారం ఆయన ఆర్బీఐ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే నగదు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ రూ.8కోట్ల నగదు ఏటీఎంలలో అందుబాటులోకి తెచ్చేందుకు అంగీకారం తెలిపారు.