విశాఖపట్నం

మహిళా సాధికారితతోనే ఆర్థికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: మహిళా సాధికారితతోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని ప్రపంచం అంతా నమ్ముతోంది. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు ఇదే సరైన సమయం. గతంలో ఐటీలోనే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. అదే ఐటీ కంపెనీలు ఇప్పుడు దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈనేపథ్యంలో పరిశ్రమల రంగంలో అనేక కొత్త అవకాశాలు వచ్చాయి. మహిళలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి. సంప్రదాయ వ్యాపారాలవైపు ఎక్కువ మంది మహిళలు మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకు అప్పడాలు, ఒడియాల తయారీకి చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఆర్గానిక్ ఫుడ్‌కు విలువ పెరగడంతో ఫాస్ట్ ఫుడ్స్ డిమాండ్ తగ్గిపోయింది. ఇంట్లోని వండిన పదార్థాలనే పిల్లలకు పెట్టాలని తల్లులు భావిస్తున్నారు. పెద్ద పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే, దానికి అనుబంధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, ఈ-బ్యాటరీ రంగంలో ఉన్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మన దేశంలో ఉన్న వనరుల కన్నా, ఇతర దేశాల్లోని వనరులు చాలా తక్కువ. చాలా దేశాల్లో వనరులను దిగుమతి చేసుకుని వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో ముడిసరుకుకు కొదవ లేదు. చాలామంది మహిళలు తమ పిల్లలకు జాబ్ సెక్యూరిటీ ఉండాలి. డాక్టర్, ఇంజనీర్‌ను చేయాలని అనుకుంటారు. ఆ మైండ్‌సెట్ నుంచి వారు బయటకు రావాలి. గతంతలో ఐటి పరిశ్రమలవైపు పరుగులు తీశారు. ఇప్పుడు ఆ కంపెనీలు మునిగిపోతున్నాయి. పరిశ్రమలు స్థాపించనప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడాలి. ఆ దిశగా యువతులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎలిప్ స్థాపించిన ఈ 25 సంవత్సరాల్లో ఐదు వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేశాం.