విశాఖపట్నం

సవాళ్లను ధీటుగా ఎదుర్కొనండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడినప్పుడే, మగవారితో సరిసమానంగా మహిళలు ఎదగగలుతారని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ అన్నారు. మూడు రోజులపాటు విశాఖలో జరిగిన అంతర్జాతీయ మహిళా పారిశ్రామివేత్తల సదస్సు శుక్రవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రత్నప్రభ మాట్లాడుతూ సార్క్ దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలను ఇక్కడికి రప్పించి, మూడు రోజులపాటు భారీ సదస్సు నిర్వహించడం పెద్ద సవాలని అన్నారు. మనవాళ్లు దాన్ని సునాయాసంగా అధిగమించారని రత్నప్రభ అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు స్పెషల్ ఎకనమిక్ జోన్‌లను ఏర్పాటు చేశామని అన్నారు. కర్ణాటకలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నానని, ఆ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ సెక్రటరీని నేనే. ఇప్పటి వరకూ తనకన్నా ముందు పనిచేసిన చీఫ్ సెక్రటరీల కన్నా మెరుగ్గా పనిచేసి, అందరి మన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్నాను. తాను ఎలా నెగ్గుకురాగలనోనని చాలా మంది వేచి చూస్తున్నారని రత్నప్రభ అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇందిరాగాంధీ, సుమిత్ర మహాజన్, మీరాకుమార్, కల్పనాచావ్లా వంటి అనేక మంది మహిళలు ఉన్నత పదవులను అధిరోహించి, వాటిని సంచలనం సృష్టించారని అన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం వారి వశమవుతుందని న్నారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ వర్శిటీలో 60 శాతం మంది యువతులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. వర్శిటీలో ప్రత్యేకించి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశామని తెలియచేశారు. ఇక్కడ చదివిన అనేక మంది యువతులు గోల్డ్ మెడల్స్ సాధించారు. విద్యలో విజయం సాధించిన వారు వివాహమైన తరువాత కేవలం వంటింటికే పరిమితమై, జీవితం ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది మంది మహిళలు మాత్రమే వ్యాపార రంగంలో రాణిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళా భాగస్వామ్య పెరగాలి. అప్పుడే జీడీపీ వృద్ధి చెందుతుందని నాగేశ్వరరావు చెప్పారు.
అలిప్ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ విశాఖలో నెలకొల్పనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని అన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఇక్కడ అవకాశం కల్పించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అలిప్ ప్రతినిధులు రజనీ అగర్వాల్, ప్రమీలా రిజాల్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందచేశారు.