విశాఖపట్నం

అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: వచ్చే ఎన్నికల నాటికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ కార్యాలయాలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అన్నారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులతో చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమం ఆశించిన దానికంటే విజయవంతమైందని, ప్రజల్లో ప్రభుత్వం, పార్టీ పట్ల మంచి అభిప్రాయం నెలకొనేందుకు ఈ కార్యక్రమం మంచి ఫలితాన్నిచ్చిందన్నారు. బూత్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు. అలాగే పార్టీ తరపున నిర్వహించిన రక్తదాన శిబిరాలపై సమాచారం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సాధారణం. అయితే శనివారం నాటి సమావేశానికి సీఎం చంద్రబాబు ఆలస్యంగా రావడంతో పార్టీ అధ్యక్షుడే జిల్లా నేతలతో మాట్లాడారు. చివరగా హాజరైన చంద్రబాబు ఆదివారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శిక్షణ శిబిరానికి హాజరుకావాల్సి ఉన్నందున తక్షణమే బయలుదేరాల్సిందిగా సూచించి సమావేశాన్ని ముగించారు.