విశాఖపట్నం

వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: దేశంలోని వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణగా నిలుస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు అన్నారు. ఏయూ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన ఆచార్య ఎస్ వెంకటరామన్ స్మారకోపన్యాసం ‘డైనమిక్స్ ఆఫ్ లైఫ్,లిబర్టీ, ప్రైవసీ అండ్ లా’ అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రజలను నడిపించేంది రాజ్యాంగమేనని, దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలు గౌరవ ప్రదమైన జీవితాన్ని సాగించడం ప్రాధమిక హక్కని, స్వేచ్ఛతా యుత సమాజం నిర్మాణం కూడా మన బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి వారి స్వేచ్ఛను, గోప్యతను హరించే హక్కు ఎవరికీ లేదన్న విషయాన్ని గుర్తెరికి మసలు కోవాలని సూచించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో జరిగిన సంఘటనలు, న్యాయస్థానం తీర్పులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. పలు తీర్పులు న్యాయశాస్త్రంపై విస్తృత అవగాహన కల్పించాయని గుర్తు చేశారు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది గురువని, అటువంటి గురువు ఆచార్య వెంకటరామన్ స్మారకోపన్యాసంలో మాట్లాడేందుకు ఆహ్వానించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు చట్టాని తెలుసుకుని నడచుకోవడటం తమ విధిగా భావించాలన్నారు. సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమన్నారు. దేశంలో దాదాపు 100 కోట్ల మంది మోబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్నారని, ఎనిమిదేళ్ల కిందట కేవలం 0.4 శాతం ఉండే ఇంటర్నెట్ వినియోగం ప్రస్తుతం 46 శాతానికి చేరుకుందన్నారు. ఒక విధంగా చూస్తే ఉపకరణాలు, సాంకేతికతకు ప్రజలు బానిసలుగా మారుతున్నారా అనే సందేహం కలుగుతోందన్నారు. ఏయూ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్శిటీలో 15 స్మారకోపన్యాసాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఏయూ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గుర్తుంచుకోవాలన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డీ సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ రెండున్నర దశాబ్ధాల అనంతరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ ఉమామహేశ్వర రావు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ జ్యోతిర్మయి, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య వీ కేశవరావు, న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.