విశాఖ

పాఠశాలల్లో వేడుకగా అమ్మకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జనవరి 22: వసంత పంచమి పర్వదినం సందర్భంగా పలు దేవాలయాలు, పాఠశాలల్లో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా పాఠశాలల్లో అమ్మకు వందనం పేరిట ప్రత్యేక కార్యక్రమాలను జరిపి మాతృమూర్తులకు పాదపూజలు చేసిన విద్యార్థులు వారి ఆశీర్వచనాలను పొందారు. ప్రధానంగా మండలంలోని జుత్తాడ ఎంపీపి స్కూల్ మెయిన్ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, అంకుపాలెం ప్రాధమిక పాఠశాల తదితర స్కూల్స్‌లో ముందుగా సరస్వతీదేవికి విద్యార్థులు పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గేదెల సన్యాశిరావు, టివి రమణ, ఎంవి స్వామి తదితరులు మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువులను గౌరవించి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకున్న పిల్లలు సమాజంలో ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానమన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాంకోసిమెంట్ ఫ్యాక్టరీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కశింకోట, జనవరి 22: మండలంలోని గొబ్బూరు గ్రామానికి చెందిన బుద్ద వెంకటరమణ రాంకోసిమెంట్ అక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీపై ఇప్పటికే మూడు పర్యాయాలు ఫిర్యాదు చేసామని అయినప్పటికీ తహశీల్థార్ పట్టించుకోలేదన్నారు. స్థానిక నాయకులు, అధికారులు కంపెనీవారితో కలిసిపోయారని ఆరోపించారు. 10బై 2 సర్వేనెంబర్‌లో బ్రిడ్జి నిర్మాణం ఆపమని గతంలో మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కంపెనీవారు దౌర్జన్యంగా బ్రిడ్జి నిర్మించారన్నారు. 29వ సర్వేనెంబర్‌లో గల సుమారు 100 సెంట్లు మామిడివాక కాలువ భూమిని అన్యాయంగా ఆక్రమించుకుని కాలువ లేకుండా చేసారన్నారు. దేవుడు భూమిని అన్యాయంగా ఆక్రమించుకుని,స్థానిక నాయకులకు కాంట్రాక్టు కట్టబెట్టి రైతుల నోరు మూయిస్తున్నారు. తహశీల్థార్ కార్యాలయంలో ఆర్‌టిఎ యాక్ట్ 2005 ప్రకారం అడిగినా సరైన సమాదానం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కలెక్టర్ దీనిపై స్పందించి అన్యాయంగా నిర్మించిన బ్రిడ్జిని తొలగించి, ఆక్రమించుకున్న మామిడివాక కాలువ ల్యాండ్‌ను తిరిగి చెరువుకు చెందేలా చర్యలు తీసుకోవలసిందిగా కోరామని రమణ తెలిపారు. అంతేకాకుండా జిల్లా అధికారులతో దర్యాప్తు చేయించి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రమణ కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.