విశాఖపట్నం

ఇవేం నివేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలు, వాటికి మంజూరవుతున్న నిధులు, పనుల ప్రగతి వంటి అంశాల్లో అధికారులు రూపొందిస్తున్న నివేదికలపై ఎంపీలు ఫైరయ్యారు. మొక్కుబడి నివేదికలు ఇస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక వౌనం వహించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతం సారధ్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జేడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. చైర్ పర్సన్ హోదాలో ఎంపీ గీత అధికారులపై పలు ప్రశ్నలు సంధించారు. పథకాల అమలు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలపై ఎంపీ గీత ప్రశ్నించగా, విశాఖ ఎంపీ హరిబాబు గొంతు కలిపారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పథకాల వివరాలను సంక్షిప్తంగా పొందుపరచకుండా అయోమయం కల్పించే విధంగా నివేదికలు ఇస్తే తమకు స్పష్టత ఏవిధంగా వస్తుందని ప్రశ్నించారు. పథకాల వారీగా లక్ష్యాలు, అందుకు మంజూరైన నిధులు, ఇప్పటి వరకూ పూర్తయిన పనులు, వెచ్చించిన నిధులు, లబ్ధిదారుల ఎంపిక, అందుకు తీసుకున్న ప్రామాణికత వంటి అంశాలపై ఎక్కడా పొంతన లేకుండా నివేదికలు ఇచ్చారంటూ అధికారులను నిలదీశారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి, వీటిలో మార్పులు కోరుకుంటున్నారా అనే అంశాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులు సకాలంలో వెచ్చిస్తే మరిన్ని నిధులు తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేస్తున్నారని, సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) ఫిర్యాదులను కూడా పరిష్కరించట్లేదన్న విమర్శలు వస్తున్నాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తక్షణమే వీటిపై అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద గిరిజన ప్రాంతాల్లో మంజూరైన రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై చైర్ పర్సన్ గీత ఆగ్రహం వ్యక్తం చేయగా, కోచైర్మన్ హరిబాబు గొంతుకలిపారు. నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుతో పనులు పూర్తి చేయాలని, అటవీ శాఖ అనుమతులు త్వరితగతిన వచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదార్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, అవసరమైతే వారికిచ్చిన పనులు రద్దు చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు నాణ్యత లేవని, స్వల్ప కాల వ్యవధిలోనే మరమ్మతులకు గురవుతున్నాయని, అటువంటి కాంట్రాక్టర్ల నుంచి నిధులు రికవరీ చేయడంతో పాటు ఇంజనీర్లను బాధ్యులను చేయాలని ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ కమిటీ సమావేశాలు తరచు నిర్వహించాలని, గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్‌ల నిర్వహణ సక్రమంగా లేదని, డ్రైవర్లు లేక వాహనాలు మూలపడ్డాయని ఫలితంగా వైద్య సేవలందక గిరిజనులు మృత్యువాత పడుతున్నారన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలోనైనా పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఇక గిరిజనులకు విద్యనందించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కట్లేదని, సర్వశిక్ష అభియాన్ కింద పాఠశాల భవనాల నిర్మాణం ఎందుకు చేపట్టట్లేదని నిలదీశారు. కో చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ మంజూరైన నిధులు సకాలంలో వెచ్చిస్తే అదనపు నిధులకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల అదనపు నిధుల కోసం ఏ విధంగా ప్రయత్నిస్తామన్నారు. సభ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా అధికారులకు సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవి పట్టణ్‌శెట్టి, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ, సహాయ కలెక్టర్ మిషా సింగ్ తదితరులు పాల్గొన్నారు.