విశాఖపట్నం

లైంగిక వేధింపుల చట్టం పటిష్టంగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: పనిచేసే ప్రాంతాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల చట్టం -2013ను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కే.శ్రీవాణి స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిధిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేదని, మహిళలకు గౌరవం, విలువ ఇచ్చే సంప్రదాయం ఉండేదన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా అవకాశాలు సాధిస్తున్న మహిళ వేధింపుల విషయంలో మాత్రం పురుషాహంకారానికి తలొగ్గకతప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మహిళల భద్రత, రక్షణ వంటి అంశాల్లో భారత్ వెనుకబడి ఉందన్నారు. ఆధునిక సమాజంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల నిత్యకృత్యాలవుతున్నాయన్నారు. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్న మహిళలు తాము పనిచేసే చోట వేధింపులకు గురవుతున్నారన్నారు. ఎన్నో న్యాయపోరాటాల అనంతరం 1997లో సర్వోత న్యాయస్థానం మహిళల భద్రతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయితే వీటికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వాలు 2013 వరకూ కాలయాపన చేశాయన్నారు. దీనిలో భాగంగా మహిళలు పనిచేసే చోట ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ (అంతర్గత ఫిర్యాదుల సంఘం), లేని పక్షంలో లోకల్ కంప్లైట్స్ కమిటీ (స్థానిక ఫిర్యాదుల సంఘం) విధిగా ఏర్పాటు చేయాలన్నారు. సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సహా మరో ఇద్దరు ఉద్యోగులు, స్వచ్ఛంధ సంస్థకు చెందిన మహిళా ప్రతినిధి సభ్యులుగా ఉంటారన్నారు. తమపై జరిగే లైంగిక వేధింపులను బాధితులు ఆయా కమిటీల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా న్యాయం పొందేందుకు వీలవుతుందన్నారు. పదిమంది కంటే తక్కువగా మహిళా ఉద్యోగులు ఉండే సంస్థల్లో ఈ తరహా సంఘటనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటయ్యే స్థానిక ఫిర్యాదుల కమిటీని సంప్రదించవచ్చన్నారు. స్ర్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను హరించే వ్యక్తులు, సంస్థలపై రాజ్యాంగ బద్దంగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులపై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు మహిళలే ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. తమకున్న సమాచారం మేరకు ఐటీ రంగంలోనే అత్యధికంగా మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలు సీ.ఉమాదేవి, గృహ హింస కౌన్సిలర్ జ్యోతిలత, ఒన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పద్మావతి, జిల్లా చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.