విశాఖ

తీర్థమహోత్సవాలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, ఫిబ్రవరి 20: మండలంలో ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో ఈ నెల 25న జరిగే మోదకొండమ్మ అమ్మవారి పాదాల తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ, వర్తక సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు మంగళవారం విలేఖరులకు తెలిపారు. లక్షల రూపాయలు వచ్చించి ఘాట్‌రోడ్డులో వెలసి ఉన్న అమ్మవారి పాదాల తీర్థ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. 25వ తేదీ తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అదే విధంగా గుర్రాల పోటీలు, కబడ్డీ వంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. తీర్థ మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
విదులకు డుమ్మాకొడితే చర్యలు
చీడికాడ, పిబ్రవరి 20: విధులకు డుమ్మాకొడితే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా క్షయ నివారణాధికారిణి వసుందర హెచ్చరించారు. చీడికాడ పిహెచ్‌సిని జిల్లా క్షయ నివారణాధికారిణి వసుందర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిహెచ్‌సిలో సిబ్బంది విదులకు సక్రమంగా రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇకపై సిబ్బంది విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవన్నారు. అలాగే పిహెచ్‌సిలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయండి
చోడవరం, పిబ్రవరి 20: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి తగిన విధంగా కృషిచేయాలని స్కూల్‌కమిటీ చైర్మన్ పీలా వెంకట గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషుబాబు, గోవాడ సుగర్స్ డైరెక్టర్ దొడ్డి కృష్ణ అప్పలసత్యనారాయణలు అన్నారు. మంగళవారం మండలంలోని జుత్తాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేరవెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రణాళికాబద్దంగా చదువుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో సందడిగా గడిపారు. సుగర్స్ డైరెక్టర్ దొడ్డి అప్పలసత్యనారాయణ టెన్త్‌లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించిన వారికి వెయ్యి రూపాయల వంతున అందజేస్తానని, సర్పంచ్ మళ్ల అప్పల సత్యనారాయణ తనవంతుగా 500 రూపాయలు అందజేస్తాన్నారు. అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ పీలా వెంకట గణేష్‌ను ఘనంగా సత్కరించారు.