విశాఖ

ప్రత్యేక హోదా నిరసన ర్యాలీతో హోరెత్తిన చోడవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 23: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల రాయితీతో కూడిన ప్రత్యేక హోదాను మంజూరు చేసి విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, రాజకీయ పక్షాల నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లేకార్డులు, బ్యానర్లు చేతబట్టి ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిరశిస్తూ నినాదాలు చేసారు. స్థానిక హార్డింజ్ అతిధిగృహం నుండి ప్రారంభించిన ర్యాలీ వినాయకుని ఆలయం, ఆంధ్రాబ్యాంక్ జంక్షన్, పోలీస్ స్టేషన్ మీదుగా కొత్తూరు జంక్షన్ వరకు సాగింది. కొత్తూరు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి సుమారు అరగంటపాటు రాస్తారోకో జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా మనహక్కు, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాంధ్రలో తక్షణం ఏర్పాటు చేయాలి, ఎయిమ్స్ ఆసుపత్రిని విశాఖలో ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేసారు. అనంతరం స్థానిక జవహర్ క్లబ్ ఆవరణలో మంత్రి కొణతాల రామకృష్ణ విద్యార్థులకు రాష్ట్ర పరిస్థితిని వివరిస్తూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులతో వారివారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ ఫలితాలు సాధించడానికి పట్టుదలతో చదవాలన్నారు. మార్చి 4న విశాఖ బీచ్‌లో అందరితో కలిసి విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు కొణతాల తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చావేదిక ప్రతినిధులు అడపా నర్సింహమూర్తి, పివిజి కుమార్, కర్రి తమ్మునాయుడు, అప్పికొండ లింగబాబు, బొడ్డేడ సూర్యనారాయణ, కోడెల జనార్ధన్, పినబోయిన అప్పారావుయాదవ్, మండె శ్రీను, కిషోర్, కుంచా కుమారి, గాయత్రీ, ఉషోదయా, విద్యార్థి తదితర కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.